Asianet News TeluguAsianet News Telugu

కడ్తాల్ కేసులో షాకింగ్ విషయాలు.. డ్రగ్స్ కేసులో నిందితుడే నిర్వాహకుడా ?

కడ్తాల్ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడి ఓ ఫాంహౌజ్ లో మూడ్రోజుల కిందట లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజు వేడుక నిర్వహిస్తున్నారనే సమాచారంతో సైబరాబాద్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న 68 మందిపై కేసులు నమోదు చేశారు. 

Kadthal rave party:  is event organizer accused in drugs case jack ? -bsb
Author
Hyderabad, First Published Jun 16, 2021, 9:32 AM IST

కడ్తాల్ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడి ఓ ఫాంహౌజ్ లో మూడ్రోజుల కిందట లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజు వేడుక నిర్వహిస్తున్నారనే సమాచారంతో సైబరాబాద్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న 68 మందిపై కేసులు నమోదు చేశారు. 

అయితే, అది పుట్టిన రోజు వేడుక కాదని, ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ‘దావత్’ గా పోలీసులు గుర్తించారు. నిర్వాహకుల్లో ఒకరైన జీషన్ అలీఖాన్ జాన్ ‘ఇన్ స్టా గ్రాం’లో ప్రకటన ఇచ్చి ఈ పార్టీకి ఆహ్వానించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులోనూ ఈ పేరు ప్రముఖంగా వినిపించింది. అతను, ఇతను ఒక్కడేనా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అసలు ఇది ఎలా తెలిసింది..అంటే మొదట్లో.. వరుణ్ గౌడ్ అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసి ఉంటాడని పోలీసులు భావించారు. పార్టీలో పాల్గొన్న వారిలో కొందర్ని ప్రశ్నించారు.

అయితే, నలుగురైదుగురు మినహా మిగిలిన వాళ్లంతా తమకు వరుణ్ గౌడ్ ఎవరో తెలియదు అని తేల్చి చెప్పడంతో అవాక్కయ్యారు.  అప్పుడు అసలు ఇది పుట్టిన రోజు వేడుక కాదని, కొందరు నిర్వాహకులు ఏర్పాటు చేసిన దావత్ అని తెలిసింది. లాక్ డౌన్ నేపథ్యంలో పబ్బులు మూతపడ్డాయి. దీంతో వీటిల్లో ఈవెంట్ను నిర్వహించేవారు మరో దారిని ఎంచుకున్నారు. 

కడ్తాల్ బర్త్‌డే పార్టీ: వెలుగులోకి డ్రగ్స్ కోణం.. ఆరా తీస్తున్న పోలీసులు...

ఫాంహౌజ్ లు ఎంచుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ‘ప్రత్యేక  పార్టీ’లంటూ ఎర వేస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు తేల్చారు. మాదక ద్రవ్యాలు మందు, చిందు తో మజా గ్యారెంటీ అంటూ రెచ్చగొడుతున్నట్లు గుర్తించారు.  ఒక్కొక్కరి దగ్గర ఫీజుగా ఐదు వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.

నిందితుల్లో ఒకరైన జాక్ నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు.  రికార్డుల్లో 2016లో బహదూర్ పురా ఠాణా పరిధిలో నకిలీ సర్టిఫికెట్, 2018లో పంజాగుట్ట పిఎస్ లో రేప్ కేసు నమోదైనట్లు గుర్తించారు. 2017 లో ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన  డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. 

ఈ కేసులో జాక్ పేరు కూడా వినిపించింది. డ్రగ్స్ ను కొరియర్ ద్వారా తెప్పించి పార్టీలో సరఫరా చేసేవాడు అని గుర్తించారు.  దీంతో జీషన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ ఒక్కడైనా అంటూ ఆరా తీస్తున్నారు.  2018లో నాంపల్లి  ఎక్సైజ్ స్టేషన్ లో జాక్ పై కేసు నమోదైనట్లు గుర్తించారు. ఈ ఇద్దరూ ఒక్కరే అని తేలితే అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios