జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: నలుగురు మైనర్లకు బెయిల్, జువైనల్ హోంలోనే ఎమ్మెల్యే కొడుకు
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో నలుగురికి జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది.ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకుకు ఇంకా బెయిల్ రాలేదు. దీంతో అతను ఇంకా జువైనల్ హోంలోనే ఉన్నాడు.
హైదరాబాద్:Jubileehills gang rape కేసులో మైనర్ బాలికపై రేప్ కేసులో నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జువైనల్ హోం నుండి నలుగురు మైనర్లు బయటకు వచ్చారు. అయితే ఇదే కేసులో ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకు మాత్రం ఇంకా జైలులోనే ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కొడుకు బెయిల్ మంజూరు కానందున ఆయన ఇంకా Juvenile హోంలోనే ఉన్నాడు.
నిందితులకు షరతులతో కూడిన బెయల్ ను మంజూరు చేసింది జువైనల్ బోర్డు. నలుగురు నిందితులకు రూ. 5 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణకు కూడా సహకరించాలని కోర్టు సూచించింది.
ఈ ఏడాది మే 28వ తేదీన జూబ్లీహిల్స్ లో Amenesia Pub కు హాజరైన విద్యార్ధినిని కారులో తీసుకెళ్లిన నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను Arrest చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఎక్కువగా ప్రజా ప్రతినిధులకు చెందిన పిల్లలు. Minor పై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు మేజర్ కాగా, ఐదుగురు మైనర్లు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఉపయోగించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు వాహనంలోని కీలక సాక్ష్యాలను కూడా సేకరించారు ఈ కేసు విషయమై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. నిందితులను కాపాడే ప్రయత్నాలు చేశారని ఆందోళనకు కూడా దిగారు. నిందితులకు పోటెన్సీ టెస్టులు కూడా నిర్వహించారు. నిందితులు ఈ కేసులో పాల్గొన్నట్టుగా శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. ఈ కేసులో 400 పేజీలతో పోలీసులు చార్జీషీట్ ను సిద్దం చేశారని సమాచారం.
also read:amnesia pub rape case : విచారణ పూర్తి, 400 పేజీలతో ఛార్జిషీట్ .. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు
ఈ ఏడాది మే 28న మధ్యాహ్నం 1:10 గంటలకు పబ్ కు బాదితురాలు వచ్చింది. మధ్యాహ్నం పబ్ లో పార్టీ చేసుకొన్నారు. సాయంత్రం 3:15 గంటల సమయంలో పబ్ లో ఉన్న బాధితురాలితో మాట్లాడిన నిందితుల్లో ఒకరు ఆమెను ఇంటి వద్ద దింపుతామని నమ్మించారు. ఈ బాలికతో పాటు మరో బాలికను కూడా నిందితులు అత్యాచారం చేయాలని ప్లాన్ చేశారు. అయితే మరో బాలిక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయింది. బాధితురాలిని ఇంటికి తీసుకెళ్తామని నిందితులు నమ్మించారు. కారులో తీసుకెళ్లి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
జూబ్లీహిల్స్ పబ్ కేసు విషయమై తాము ఎలాంటి ఒత్తిడులు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామని రాష్ట్ర హోంశాక మంత్రి మహమూద్ అలీ గతంలోనే ప్రకటించారు.ఈ విషయమై హోం మంత్రి మనమడిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు అవాస్తవమని పోలీసులు తేల్చి చెప్పారు.ఈ కేసు విషయమై మైనర్ బాలిక ఫోటోను మీడియా సమావేశంలో విడుదల చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.