జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి నోటీసులివ్వనున్న పోలీసులు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఆబిడ్స్ పోలీసులు  నోటీసులు ఇవ్వనున్నారు. మైనర్ బాలిక పోటోలు, వీడియోలు మీడియా సమావేశంలో విడుదల చేయడంపై  వివరణ కోరుతూ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.

Jubileehills gang rape case: Hyderabad Abids police To Serve notice To BJP MLA Raghunandan Rao

హైదరాబాద్:బీజేపీ ఎమ్మెల్యే Raghunandan Raoకు పోలీసులు Notice ఇవ్వనున్నారు. ఇప్పటికే Abids పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే రఘునందన్ రావుపై Case  నమోదైంది.Hyderabad Amnesia పబ్ నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మీడియా సమావేశంలోనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోటోలు విడుదల చేశారు.ఈ విషయమై ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. 

ఈ పిర్యాదు మేరకు 228 ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది.  మీడియా సమావేశంలో ఫోటోలు విడుదల చేయడంపై పోలీసులు ఎమ్మెల్యే రఘునందన్ రావుకి  నోటీసులు ఇవ్వనున్నారు. బాధిత బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేయడంపై వివరణ కోరుతూ ఆబిడ్స్  పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

అమ్నేషియా పబ్ నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి కారులో అత్యాచారానికి పాల్పడ్డారని గత వారంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.మీడియా సమావేశంలో కారులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫోటోలను విడుదల చేశారు. అయితే బాలిక ముఖం కన్పించకుండా ఎమ్మెల్యే జాగ్రత్త తీసుకున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని చెప్పేందుకు  ఈ ఫోటోలను ఎమ్మెల్యే విడుదల చేశాడు. 

అయితే ఈ విషయమై  పోలీసులు లీగల్ ఓపినియన్ తీసుకున్నారు.  మైనర్ బాలిక సంబంధించిన ఫోటోలు విడుదల చేయడంపై కాంగ్రెస్ కూడ తీవ్రంగా తప్పు బడుతుంది.  బాధితురాలిని గుర్తించేలా ఎమ్మెల్యే వ్యవహరించడం సరైందికాదని కాంగ్రెస్ ఆభిప్రాయపడింది.ఇదే విషయమై ఎన్‌ఎస్‌యూఐ నేతలు సోమవారం నాడు బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు.  ఈ సమయంలో బీజేపీ, ఎన్ఎస్‌యూఐ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.ఎన్ఎస్‌యూఐ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఇదిలా ఉంటే మీడియా సమావేశంలో ఫోటోలు విడుదల చేయడంపై తనపై కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు విమర్శలు చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు తప్పుబట్టారు.

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో  గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని Telangana రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

also read:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: నిందితులను వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్, నేడు విచారణ

 నిందితులు ఉపయోగించిన కార్లలో కూడా పోలీసుటు టెక్నికల్ ఎవిడె్న్స్ ను సేకరించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును రెండు రోజుల క్రితం పోలీసులు సీజ్ చేశారు. అంతకు ముందే బెంజీ కారును కూడా పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios