హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు వెనక ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్న నిర్వాహకుడి భార్యనే రాకెట్ గుట్టు రట్టు కావడం వెనక ఉన్నట్లు పోలీసుల కథనాన్ని బట్టి తెలిసింది. నిర్వాహకుడు రాఘవేంద్ర రెడ్డి పరారీలో ఉన్నాడు. 

రాఘవేంద్ర రెడ్డి భార్యనే సెక్స్ రాకెట్ నడుపుతున్న సమాచారాన్ని తమకు అందించినట్లు పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో మహిళలను రప్పించి అతను సెక్స్ రాకెట్ నడుపుతున్న చెప్పారు. భార్య లేకపోవడంతో అతనికి ఆ అవకాశం లభించినట్లు అంటున్నారు. 

Also Read: హైదరాబాదులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: టెక్కీ సహా పట్టుబడిన నేత

రాఘవేంద్ర రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తనను అతను వేధిస్తున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని ఆమె తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాను లేకపోవడంతో ఇంట్లోనే బ్రోతల్ నడుపుతున్నట్లు ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

హైదరాబాదులోని వనస్థలిపురం ఆటో నగర్ లో పోలీసులు సెక్స్ రాకెట్ గుట్టును బయటపెట్టిన విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డిని, సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీక్షిత్ ను పట్టుకున్నారు. వారితో పాటు ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. 

సెక్స్ రాకెట్ నిర్వాహకుడు ఆటో నగర్ ఎండీ రాఘవేంద్ర రెడ్డి పరారీలో ఉన్నాడు.నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు చెప్పారు.  వనస్థలిపురంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వనస్థలిపురం రెడ్ జోన్ లో ఉంది.