ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి.. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి చెత్త వేశాలు వేశాడు. ఓ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. యువతులతో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగేందర్‌ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్‌ భవన్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. సదరు ఆఫీసర్ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అయితే.. అతను రాసలీల నిమిత్తం హైదరాబాద్ వచ్చినట్లు ఆలస్యంగా తెలిసింది.

బుధవారం అమీర్‌పేట్‌లో వ్యభిచారం దందా నడుస్తున్నట్లు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి నిర్వహించిన పోలీసులకు నాగేందర్‌ ముగ్గురు యవతులతో అడ్డంగా దొరికిపోయాడు. నాగేందర్‌తో పాటు, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.