నల్గొండ: తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 

ఆదివారం నాడు నల్గొండలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  తెలంగాణలో ఈ నెల 13,14 తేదీల్లో జరిగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు.

రాహుల్‌గాంధీని ఓయూలోకి తీసుకొన్తామని ఆయన ప్రకటించారు. తాను టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్తున్నట్టు  వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తాను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆయన చెప్పారు.  త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు ఆయన చెప్పారు.

"