Asianet News TeluguAsianet News Telugu

దిశ కేసు: ఇద్దరు కాదు... ముగ్గురూ మైనర్లేనా..?

విచారణ లో భాగంగా.. నిందితుల కుటుంబసభ్యులను వారు విచారించారు. ఆ సమయంలో ‘‘ మైనర్లు అని కూడా చూడకుండా మా బిడ్డలను ఎన్ కౌంటర్ చేశారు’ అంటూ వారు అధికారులను ప్రశ్నించినట్లుసమాచారం.

Hyderabad vet murder: Parents of accused rapists claim 3 of them were minors
Author
Hyderabad, First Published Dec 11, 2019, 8:22 AM IST

షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయితే... వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారనే వాదనలు వినపడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే... ఇద్దరు కాదు.. ముగ్గురు మైనర్లు. 

దిశ కేసులో నలుగురు నిందితులను పట్టుకున్న సమయంలో... మహ్మద్ ఆరిఫ్(26), జొల్లు శివ(20), జొల్లు నవీన్(20), చెన్నకేశవులు(20) ఏళ్లు అని పోలీసులు మీడియాకు వివరించారు.

అయితే... వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని తప్పుపడుతూ సీన్ లోని మానవహక్కుల సంఘం విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణ లో భాగంగా.. నిందితుల కుటుంబసభ్యులను వారు విచారించారు. ఆ సమయంలో ‘‘ మైనర్లు అని కూడా చూడకుండా మా బిడ్డలను ఎన్ కౌంటర్ చేశారు’ అంటూ వారు అధికారులను ప్రశ్నించినట్లుసమాచారం.

దీంతో... వారి మాటలకు అధికారులు కంగుతిన్నారు. మీ కుమారులకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్స్ ని ఇవ్వండి అంటూ... అధికారులు వారి దగ్గర నుంచి సేకరించారు. వాటిలో ఒకరి పుట్టిన తేదీ 15-08-2002గా ఉంది. దీని ప్రకారం అతని వయసు 17 సంవత్సరాల ఆరునెలలు. ఆధార్ కార్డ్ లో మాత్రం పుట్టిన సంవత్సరం 2001గా ఉంది. 

మరో నిందితుడి పుట్టిన తేదీ సర్టిఫికేట్ లో 10-04-2004గా ఉంది. దీని ప్రకారం అతని వయసు 15 సంవత్సరాల 8నెలలు. ఇలా తేదీలు వేర్వేరుగా ఉండడంతో ఏది వాస్తవమనే సందేహాలు నెలకొన్నాయి. నలుగురు నిందితుల్లో మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు అని పోలీసులు   చెప్పినా, వీరికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేనట్లు తెలుస్తోంది. 

కాగా... ‘దిశ’ నిందితుల్లో మూడోవాడు జొల్లు నవీన్‌కుమార్‌ కూడా మైనరే అనడం చర్చనీయాంశమైంది. శివ, చెన్నకేశవులు మైనర్లు అంటూ సోమవారం వారి తల్లిదండ్రులు బోనఫైడ్‌ సర్టిఫికెట్లు చూపించారు. నవీన్‌ కూడా మైనరేనంటూ మంగళవారం అతని తల్లి బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ తెచ్చారు.

నిందితుల కుటుంబీకుల స్టేట్‌మెంట్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నమోదు చేసింది. బోనఫైడ్‌ సర్టిఫికెట్లు బయటకు వస్తుండటంతో ఎన్‌కౌంటర్‌ కేసు ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తినెలకొంది. ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ మినహా మిగిలిన ముగ్గురు మైనర్లే అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios