బాలుడిపై మేనమామ లైంగిక దాడి

Hyderabad: Uncle sexually assaults boy of 12 years
Highlights

ఇంట్లోకి వెళ్లిన బాలుడిని గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఈ ఘటనతో బాలుడు షాక్ కి గురయ్యాడు

ఈ మధ్యకాలంలో.. ఆడపిల్లలనే కాదు.. మగపిల్లలను కూడా వదలడం లేదు కొందరు కామాంధులు. తాజాగా.. ఓ 12 ఏళ్ల బాలుడిని సొంత మేనమామ లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జియాగూడలోని సబ్జీమండి ప్రాంతానికి చెందిన మహ్మద్ రియాజ్, అఫ్‌జాల్ ఉన్నిసా బేగం దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గురువారం సాయంత్రం సమయం లో వారి రెండవ కుమారుడు ఇంతియాజ్ (12) స్నేహితులతో ఆడుకుని ఇంట్లోకి రాగా పక్కింట్లో నివాసం ఉంటున్న మేనమామ సయ్యద్ సద్దాం (23) ఇంతియాజ్‌ను పని ఉందని రమ్మన్నాడు.

ఇంట్లోకి వెళ్లిన బాలుడిని గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఈ ఘటనతో బాలుడు షాక్ కి గురయ్యాడు. ఈ విషయంలో బాధ పడుతున్న కుమారుడిని విషయం అడుగగా జరిగిన సంగతి తండ్రికి తెలిపాడు.  దీంతో ఆయన కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

loader