హైదరాబాద్: నగరంలో మరోసారి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైద్రాబాద్ లో విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.ప్రముఖ హోటల్‌లో చెఫ్ పనిచేసే సలీం డ్రగ్స్ సరఫరా చేయడంలో కీలకపాత్రధారిగా గుర్తించారు.

పబ్‌లకు వచ్చేవారితో పరిచయాలను పెంచుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నారు.సెక్స్ సామర్ధ్యం పెరుగుతోందని నమ్మించి డ్రగ్స్ ను విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు. 

200 గ్రాముల మెఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకొన్నట్టుగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రకటించారు. పబ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులు తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. ఈ డ్రగ్స్ ను కొందరు టెలీమార్కెటింగ్ చేస్తున్నారని కూడ పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితుడు సలీం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సోదాల్లో కొత్త రకం డ్రగ్స్ ను పోలీసులు గుర్తించారు. గతంలో కూడ నగరంలో డ్రగ్స్ ను విక్రయిస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.