హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మహిళపై 139 మంది అత్యాచారం చేసిన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. 

తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని యువతి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు చేసిన రెండు రోజులకు డాలర్ బాయ్ ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఓ తెలుగు మీడియా న్యూస్ ఛానెల్  ఈ విషయమై కథనాలను ప్రసారం చేసింది.

డాలర్ బోయ్ అలియాస్ రాజా శ్రీరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాలర్ బోయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంధ సంస్థను కూడ పోలీసులు సీజ్ చేశారు.

also read:139 మంది రేప్ చేశారు: పంజగుట్ట పోలీసులకు మిర్యాలగూడ మహిళ ఫిర్యాదు

డాలర్ బోయ్ పై ఆయన భార్య కూడ గతంలోనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. గతంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు.డాలర్ బోయ్ గురించి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తున్నాయి.