హైదరాబాద్‌లో పబ్‌ల అరాచకం కొనసాగుతుంది. అక్రమ ఆదాయమే లక్ష్యంగా నిర్వహకులు.. కస్టమర్లను ఆకర్షించడానికి గబ్బు పనులకు పాల్పడుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పబ్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు.

హైదరాబాద్‌లో పబ్‌ల అరాచకం కొనసాగుతుంది. అక్రమ ఆదాయమే లక్ష్యంగా నిర్వహకులు.. కస్టమర్లను ఆకర్షించడానికి గబ్బు పనులకు పాల్పడుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పబ్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా కేపీహెచ్‌బీలో మంజీరా మెజిస్టిక్‌ కమర్షియల్‌లోని క్లబ్‌ మస్తీ పబ్‌లో మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. క్లబ్ మస్తీ పబ్ లో కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

అయితే క్లబ్ మస్తీ పబ్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ పోలీసులు గత రాత్రి ఈ దాడులు జరిపారు. అక్కడ యువతులతో అర్దనగ్న నృత్యాలు, పరిమితికి మించి డీజే సౌండ్‌తో పబ్‌ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దాడుల అనంతరం పోలీసులు 9 మంది యువతులు, మేనేజర్‌ ప్రదీప్‌, డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు కృష్ణ, విష్ణు పరారయ్యారు. దాడుల సందర్భంగా పోలీసులు క్లబ్ మస్తీ పబ్ లో డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్నవారిని ఎస్వోటీ పోలీసులు కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించారు. అయితే, కస్టమర్లను ఆకర్షించేందుకే పబ్‌ యాజమాన్యం అమ్మాయిలతో ఇలా అర్ధనగ్న నృత్యాలు చేపిస్తున్నట్టు సమాచారం.