హైదరాబాద్: బాచుపల్లి అత్యాచార కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలను తెలుసుకొన్నారు. నిందితుడి సెల్‌ఫోన్‌లో మరికొందరు మహిళల ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. 

హైద్రాబాద్‌లో ఉంటున్న మహిళ గతంలో విదేశాల్లో ఉన్న సమయంలో మామిడి సంజీవరెడ్డి పరిచయం పెంచుకొన్నాడు. ఆమె హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చారు.

Also read:అమెరికా నుంచి వచ్చిన యువతిపై భర్త రేప్: వీడియో తీసిన భార్య

శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలిపై అత్యాచారం చేసే సమయంలో నిందితుడి భార్య , మేనల్లుడు తమ ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. 

బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని విచారిస్తున్న సమయంలో మరికొందరు మహిళలు నిందితుడి ఉచ్చులో చిక్కుకొన్నారని పోలీసులు గుర్తించారు.

నిందితుడి ఫోన్‌లో పలువురు యువతుల పోన్ నెంబర్లు లభించాయి. అంతేకాదు వీడియోలు,ఫోటోలను కూడ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురి బారిన మరికొందరు యువతులు పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

యువతుల అశ్లీల చిత్రాలన్నీ కూడ నిందితుడి వద్ద ఉన్న ఫోన్ ద్వారానే చిత్రీకరించినట్టుగా పోలీసులు గుర్తించారు.  నిందితుడి వద్ద తుపాకీ, బాధిత మహిళకు చెందిన ఓ చెక్ బుక్, డెబిట్, క్రెడిట్ కార్డులు కూడ దొరికాయి. 

బాధితురాలి వద్ద  తీసుకొన్న చెక్కులను నిందితుడు ఎందుకు తీసుకొన్నాడనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  నిందితులను తమ కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.