టీఎస్‌పీఎస్‌సీ కేసులో విస్తుపోయే నిజాలు: ప్రవీణ్ 'నగ్న' సత్యాలపై పోలిసుల ఫోకస్

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో  ప్రవీణ్ వద్ద ఉన్న మొబైల్ లో  చాటింగ్  ను  పోలీసులు రిట్రీవ్  చేసే ప్రయత్నం  చేస్తున్నారు.  

 Hyderabad Police  Found  Key information  in TSPSC  Question Paper  leakage Case

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ  కేసు విచారణలో  పోలీసులు కీలక విషయాలను గుర్తించారు.  ప్రవీణ్ కు చెందిన  మొబైల్ ఫోన్ లో  మహిళల తో వాట్సాప్  సంభాషణల్లో కీలక విషయాలను  పోలీసులు గుర్తించారు. మరో వైపు  మహిళలతో  ప్రవీణ్  సన్నిహితంగా  ఉన్నట్టుగా  పోలీసులు గుర్తించారు.   ఈ వాట్సాప్ సంభాషణలను  ప్రవీణ్ డిలీట్  చేశారు. ఈ సంభాషణలను రిట్రీవ్  చేసేందుకు  పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  ఈ కేసులో  నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని  పోలీసులు భావిస్తున్నారు. 

2017 లో  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో  ప్రవీణ్  జూనియర్ అసిస్టెంట్ గా  చేరాడు.  ప్రస్తుతం  అసిస్టెంట్  సెక్షన్ ఆఫీసర్ గా  పనిచేస్తున్నాడు. టీఎస్‌పీఎస్‌సీలో  ఉన్నతాధికారుల వద్ద  ప్రవీణ్ అత్యంత నమ్మకంగా  ఉండేవాడని  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. నాలుగేళ్లుగా  ప్రవీణ్  వెరిఫికేషన్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు.  వెరిఫికేషన్ కు వచ్చే  మహిళల ఫోన్ నెంబర్లను  ప్రవీణ్ తీసుకునేవాడు. ఈ ఫోన్ నెంబర్లతో మహిళలతో  సాన్నిహిత్యం  పెంచుకొనేవాడని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  టీవీ 9 కథనం ప్రసారం  చేసింది.    రేణుక అనే మహిళ కోసం  ప్రవీణ్ టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాన్ని లీక్  చేసినట్టుగా  పోలీసులుగుర్తించారు. 

also read:ప్రశ్నాపత్రాల లీక్: నేడు టీఎస్‌పీఎస్‌సీ కీలక భేటీ, ఇద్దరిపై వేటు

టీఎస్‌పీఎస్‌సీలో  పనిచేసే శంకర్ లక్ష్మి కంప్యూటర్  నుండి  ప్రశ్నాపత్రాలను  ప్రవీణ్, రాజశేఖర్ లు  కాపీ  చేసినట్టుగా  పోలీసులు దర్యాప్తులో  గుర్తించారు. ఈ నెల  5, 15, 16 తేదీల్లో  జరగాల్సిన  పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.  టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్ , వెటర్నరీ  అసిస్టెంట్ సర్జన్ల నియామాకాలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయనే అనుమానాలతో  వాయిదా వేశారు. అయితే  ఈ నెల  5వ తేదీన  జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్  పరీక్షకు సంబంధించి పరీక్ష  పేపర్  లీకైనట్టుగా  పోలీసులు గుర్తించారు

గతంలో  నిర్వహించిన  పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు  లీకయ్యాయా అనే కోణంలో  కూడా  పోలసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రవీణ్  ఉపయోగించిన  ఫోన్ ను  పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు.  ఎఫ్ఎస్ఎల్ నుండి  వచ్చే రిపోర్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తును చేయనున్నారు.   
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios