హైదరాబాద్ శివారులో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ముంబయి నగరం నుంచి యువతులను నగరానికి రప్పించి మరీ... ఈ సెక్స్ రాకెట్ ని కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. కాగా... పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆరుగురు యువతులను, నలుగురు విఠులను అరెస్టు చేశారు.

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ఫ్రాంతంలో రాజస్థాన్ కి చెందిన దీపక్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నాడు. కాగా... సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అతను వ్యభిచార దందా చేయడం మొదలుపెట్టాడు. ఉప్పర్ పల్లిలోని సన్ రైజ్ కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ముంబయి నుంచి కొందరు యువతులను ఇక్కడికి దిగుమతి చేశాడు.

అందంగా.. చూడగానే ఆకర్షించగల అమ్మాయిలను ఎంపిక చేసి... వారిని తీసుకువచ్చి.. వాళ్ల శరీరాలతో వ్యాపారం చేస్తూ... డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ ఇంటికి రోజుకి పదుల సంఖ్యలో యువకులు వస్తుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సోదాలు చేసి... వారి గుట్టుని రట్టు చేశారు.

దీపక్‌తో పాటు నలుగురు విటులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.