జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరిన పోలీసులు

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టైన మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును హైద్రాబాద్ పోలీసులు కోరారు. ఈ కేసులో మైనర్లే అధికంగా ఉన్నారు. 
 

Hyderabad Police asks Juvenile Justice Board to consider minor accused as majors in Jubilee Hills gang rape case

హైదరాబాద్: Jubilee Hills Gang Rape రేప్ కేసులో  Hyderabad పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ కేసులో అరెస్టైన మైనర్లను  మేజర్లుగానే పరిగణించాలని Juvenile Justice  Board ను హైద్రాబాద్ పోలీసులు కోరారు. ఈ విషయమై జువైనల్ జస్టిస్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోననేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

ఈ కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో  ఒక్కరు మేజరు కాగా, ఐదుగురు మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన మేజర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగిలిన మైనర్ నిందితులను జువైనల్ హోంకి తరలించారు. జువైనల్ హోంలో ఉన్న నిందితులు  బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు.  అయితే ఈ తరుణంలో  మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు హైద్రాబాద్ పోలీసులు.. ఈ మేరకు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. అయితే మరొకొన్ని ప్రసార సాధనాలు మాత్రం ఈ విషయమై పోలీసులు లీగల్ ఓపినయన్ తీసుకుంటున్నారని కథనాలు ప్రసారం చేశాయి. 

మైనర్ల మానసిక స్థితి, నేరం చేసే సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జువైనల్ బోర్డు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.మైనర్లు 21 ఏళ్లు దాటిన తర్వాత జువైనల్ హోం నుండి సాధారణ జైలుకు తరలిస్తారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కారులోనే బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ప్రకటించారు. 

aloread:Amnesia Pub Rape Case : పథకం ప్రకారమే బాధితురాలి ట్రాప్.. ట్యాగ్ తెంచేసి, ఫోన్ లాక్కుని...

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios