హైదరాబాద్: ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విషయంలో  ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ ఒక్క యువతిపైనే కాకుండా ఈ రకంగా పలువురికి ఉద్యోగాల ఆశలను చూపి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నాడనే  నెపంతో  రాజ్‌కిరణ్ అనే వ్యక్తిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన  ఓ యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఓ మహిళ కారులో గుంటూరుకు తీసుకెళ్లింది. మత్తుమందు కలిపిన నీళ్లివ్వడంతో  ఆ యువతి మత్తులోకి జారుకొంది.  ఆ తర్వాత తనపై గుంటూరులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని బాధితురాలు రెండు రోజుల క్రితం ఎస్సార్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా  ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మన అసోసియేషన్ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసిన రాజ్‌కిరణ్ యువతులకు గాలం వేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సినీ ఆర్టిస్టులకు సభ్యత్వాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేయడం, సినిమాల్లో అవకాశాల కోసం యువతులకు గాలం వేయడం వంటి పనులు చేసేవారని రాజ్‌కిరణ్‌పై  గతంలో ఓ సినీ నటి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉద్యోగాల పేరుతో  యువతులకు వలవేసి వారిపై అత్యాచారాలకు పాల్పడడమే కాకుండా వారి నగ్న చిత్రాలను  తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుంటారని బాధితులు గతంలో ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో రాజ్‌కిరణ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. 

 

   ఈ వార్తలు చదవండి:జూనియర్ ఆర్టిస్ట్‌పై గ్యాంగ్‌రేప్..నమ్మిన స్నేహితురాళ్లే ముంచారు

జాబ్స్‌పేరుతో 30 మంది యువతులపై రేప్: మస్తాన్ వలీ అరెస్ట్