హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియాకు చెందిన వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

స్టూడెంట్ వీసా మీద హైద్రాబాద్ కు వచ్చిన నైజీరియాకు చెందిన డానియల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుండి 6 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు.గతంలో కూడ హైద్రాబాద్ లో యువతను లక్ష్యంగా చేసుకొని నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కారు.

హైద్రాబాద్ నగరంలోని ప్రముఖ స్కూళ్లలోని విద్యార్థులకు కూడ గతంలో డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఎక్సైజ్ శాఖాధికారులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నగరంలోకి ఇతర ప్రాంతాల నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టింది. 

లాక్ డౌన్ సమయంలో కూడ కరోనా మందుల పేరుతో నగరానికి డ్రగ్స్ ను కొందరు తీసుకొచ్చిన విషయాన్ని పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.