హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో మరో డ్రగ్స్ ముఠాను సోమవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గతంలో కూడ డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో కూడ ఇదే తరహాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.నగరంలోని బోయిన్ పల్లి, మల్కాజిగిరి ఏరియాల్లో  నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నారని కచ్చితమైన సమాచారం అందుకొన్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

సాయిరెడ్డి, విక్రమ్ అనే నిందితుల నుండి నిషేధిత హపీస్ ఆయిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు ఎక్కడి నుండి డ్రగ్స్ ను తీసుకొచ్చారు.. ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైద్రాబాద్ లోని కొన్ని స్కూళ్లకు గతంలో డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడ కౌన్సిలింగ్ ఇచ్చారు.