హైదరాబాద్: పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది రేప్ చేశారని యువతి ఫిర్యాదులో కీలక అంశం చోటు చేసుకొంది.కొంత కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న డాలర్ బాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తనపై 139 మంది అత్యాచారం చేశారని సినీ, రాజకీయ ప్రముఖులు కూడ ఇందులో ఉన్నారని ఆ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీసీఎస్ కు పంజగుట్ట పోలీసులు బదిలీ చేశారు.

ఈ కేసులో డాలర్ బాయ్ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కకుండా పోయిన డాలర్ బాయ్  వీడియో  సందేశాలను పంపిన విషయం తెలిసిందే.ఈ కేసులో తమను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని కొందరు సినీ ప్రముఖులు ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:139 మంది రేప్ చేశారు: పంజగుట్ట పోలీసులకు మిర్యాలగూడ మహిళ ఫిర్యాదు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన యువతి తనపై కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో డాలర్ బాయ్ ప్రమేయం గురించి పోలీసులు ఆరా తీశారు. అదే సమయంలో ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించబుకొన్నాడు. దీంతో ఇవాళ ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 

తాజాగా తన వాంగ్మూలంలో యువతి మాట మార్చింది. తనపై డాలర్ బాయ్ ఒక్కడే అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు డాలర్ బాయ్ ను గోవాలో అరెస్టు చేశారు.