Liquor shops in Hyderabad: హైదరాబాద్‌లో కోవిడ్ హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్‌ల కన్నా వైన్ షాప్‌లే ఎక్కువ.. !
హైదరాబాద్‌లో (Hyderabad) జనాభాకు అనుగుణంగా ఉన్న కోవిడ్ ఆస్పత్రులు (hospitals), పోలీస్ స్టేషన్‌ల కన్నా.. మద్యం దుకాణాలు (liquor shops) ఎక్కువగా ఉన్నాయి. నగరంలోని మొత్తం జనాభా, వైన్ షాపుల డేటా ఆధారంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ ఈ విశ్లేషణ చేసింది.
కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యమేస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని మద్యం దుకాణాలకు (liquor shops) సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. మద్యం అమ్మకాల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వాలు భావిస్తుంటాయి.. అయితే ఇలాంటి సందర్భంలో ప్రజారోగ్యానికి కూడా పెద్దపీట వేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా ఉన్న కోవిడ్ ఆస్పత్రులు (hospitals), పోలీస్ స్టేషన్‌ల కన్నా.. మద్యం దుకాణాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ (IPS) తెలిపింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ సంస్థ తన హక్కు ఇనిషియేటివ్‌లో (Hakku Initiative) భాగంగా ఈ డేటాను సేకరించినట్టుగా తెలిపింది. నగరంలోని మొత్తం జనాభా, వైన్ షాపుల డేటా ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది. హైదరాబాద్‌లో ప్రతి ప్రతి 22,323 మందికి ఒక liquor shops ఉండగా, 77,792 మంది నివాసితులకు ఒక పోలీసు స్టేషన్ ఉంది. అదేవిధంగా, హైదరాబాద్‌లో ప్రతి 34,691 మంది నివాసితులకు కోవిడ్-19 చికిత్స కోసం ఒక ఆసుపత్రి ఉన్నట్టుగా పేర్కొంది.
The Institute of Perception Studies డైరెక్టర్ డాక్టర్ నీలిమా కోట మాట్లాడుతూ.. ‘మేము అన్ని రకాల మద్యం దుకాణాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ వ్యత్యాసం చాలా పెద్దదిగా ఉంటుంది(చట్టపరమైన, చట్టవిరుద్ధమైన మద్యం దుకాణాలు. కోవిడ్- 19 మహమ్మారి సమయంలో వైన్ షాపులకు ఇచ్చిన ప్రాధాన్యతను, హైదరాబాద్‌లో ప్రజల భద్రత, ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను మద్య తేడాను చూపించడానికి ఈ విశ్లేషణ. పోలీస్ స్టేషన్ల కంటే 3.5 రెట్లు ఎక్కువ వైన్ షాపుల ఉన్నచోట మహిళలు సురక్షితంగా ఉండగలరా..’ అని ప్రశ్నించారు.
ఇది కేవలం భద్రతకు సంబంధించిన ఆందోళన మాత్రమే కాదని.. ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది కూడా అని నీలిమ అన్నారు. ‘కొవిడ్ అనేది ప్రతి పౌరునికి ప్రాణపాయం కలిగించే తీవ్రమైన అత్యవసర పరిస్థితి. రాష్ట్ర ఖజనాను నిపండానికి ఇచ్చిన ప్రాముఖ్యత.. మహమ్మారి విజృంభిస్తున్న ఆరోగ్య పరంగా ప్రభుత్వం ఇంకా సన్నద్దం కావాల్సిన అవసరాన్ని చూపుతోంది. ఇదంతా అవగాహన పెంచడం, పౌరులకు అవసరమైన వాటిని అమలు చేయడం కోసమే’అని డాక్టర్ Neelima Kota తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 460 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే నూతన మద్యం పాలసీ ప్రకారం మరికొన్ని మద్యం షాపులు పెంచేందుకు కొత్త లైసెన్స్‌లు ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణలు ఉండగా.. వీటిని సంఖ్యను 2,620కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ. 10,833 కోట్లు కాగా, 2021 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 27,888 కోట్లకు చేరుకుంది. మద్యం అమ్మకాలు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య వసతులు, భద్రత సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరుల భద్రత, ఆరోగ్యం కంటే ఆదాయమే ముఖ్యమా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also read: తెలంగాణ.. వైన్స్ కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల.. తొలుత లాటరీ వాళ్లకే..
డిసెంబర్ 1, 2021 నుంచి రెండేళ్ల కాలపరిమితికి మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. గతంలో కంటే ఈ సారి 400 మద్యం షాపులు పెరిగాయి. ఈ నెల 18వరకు మద్యం దుకాణలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరిస్తారు. 20న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి లాటరీలో మద్యం దుకాణలు దక్కించుకున్నవారు వాటిని నిర్వహిస్తారు.