Asianet News TeluguAsianet News Telugu

సంగీత దర్శకుడి మెడకు డ్రగ్ ఉచ్చు

డ్రగ్ మాఫియాలో సంగీత దర్శకుడు

సినీ పెద్దల అరెస్టులకు రంగం సిద్ధం

వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్నవారి జాబితా సిద్ధం

కెల్విన్ విచారణలో కీలక సమాచారం సేకరణ

hyderabad drug deals popular music director among  suspects

ఒక ప్రముఖ సంగీత దర్శకుడి మెడకు సైతం డ్రగ్ ఉచ్చు చుట్టుకుంటోందన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరందుకుంది. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయడం, కొందరిని విచారణకు పిలుస్తున్న తరుణంలో రెండో జాబితా వెలువరిస్తామన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రెండో జాబితాలో ఒక సంగీత దర్శకుడి పేరు కూడా ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

 

మొదటి జాబితాలో పేరున్న హీరోయిన్ ఛార్మికి ఆ సంగీత దర్శకుడు అత్యంత సన్నిహితుడు అన్న ప్రచారం ఉంది. దీంతో ఆ సంగీత దర్వకుడెవరబ్బా అన్న చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. ఆయనతోపాటు ఆయన సోదరుడు కూడా డ్రగ్ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇక రెండో జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయా అన్న టెన్షన్ డ్రగ్ ఉచ్చులో ఉన్న వారిలో నెలకొంది.

 

డ్రగ్ మాఫియా దారులుగా పోలీసులకు చిక్కి రిమాండ్ లో ఉన్న కెల్విన్, కుద్ధుస్, వహీద్ లను పోలీసులు తమ కస్టడి తీసుకుని తొలిరోజు విచారించారు. ఇంకోరోజు కూడా వారిని విచారించే అవాకశం ఉంది. తొలిరోజు విచారణలో వీరిద్దరు నిందితులు అత్యంత కీలకమైన సమాచారాన్ని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరు సినీ పెద్దలకు నోటీసులు జారీ చేయవచ్చని చెబుతున్నారు.

 

ఇక అగ్రహీరోలుగా కొనసాగుతున్నవారిలో కూడా కొందరు డ్రగ్ బాధిత జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. వారికి సైతం నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక డ్రగ్ బాధితులను విచారించి వదిలేయడంతోపాటు డ్రగ్ వ్యాపారంలో భాగస్వాములైన సినీ ప్రముఖులను మాత్రం వీలున్నంత తొందర్లోనే అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ వారు. దీంతో ఎవరి అరెస్టు జరుగుతుందా అన్న ఆందోళనలు సినీ వర్గాలను కుదిపేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios