Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ లో పనిమనిషిపై అత్యాచారం: మురళీ ముకుంద్ అరెస్ట్

పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో ఓ ప్రముఖ విద్యా సంస్థ మాజీ చైర్మెన్ మురళీ ముకుంద్ ను  పోలీసులు  అరెస్ట్ చేసి  కోర్టులో హాజరు పర్చారు.

Hyderabad Banjara Hills Police Arrested Murali Mukund for Raping house maid lns
Author
First Published Oct 24, 2023, 1:27 PM IST


హైదరాబాద్: పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో ఓ ప్రముఖ విద్యాసంస్థ మాజీ చైర్మెన్ మురళీ ముకుంద్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.  మంగళవారంనాడు నాంపల్లి  జడ్జి నివాసంలో హాజరుపర్చారు. ఈ ఏడాది జూలై  16న  ప్రముఖ  విద్యాసంస్థ మాజీ చైర్మెన్  మురళీ ముకుంద్ తన  ఇంట్లో పనిచేసే  పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ విషయాన్ని  బయటకు చెబితే చంపేస్తామని బెదిరించాడు.ఈ విషయాన్ని  మురళీ ముకుంద్ కొడుకు ఆకాష్ కు బాధిత యువతి చెబితే  అతను ఆమెపై దాడికి దిగాడు. యువతి స్నానం చేస్తున్న సమయంలో  ఫోటోలు , వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  మురళీ ముకుంద్ ను అరెస్ట్ చేశారు.

బాధితురాలిపై  ఈ ఏడాది జూలై 20 న  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు బనాయించారని  బాధితురాలు ఆరోపిస్తున్నారు.  బాధితురాలిపై  సిమ్ కార్డు దొంగతనం కేసు మోపారని చెబుతున్నారు. దీంతో  బాధితురాలు  మురళీ ముకుంద్ ఇంట్లో పని మానేసింది.  తన స్వగ్రామంలోనే ఉంటుంది. అయితే కూతురిని తల్లి  నిలదీసింది. దీంతో  తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు  తల్లికి చెప్పింది.  దరిమిలా  బాధితురాలిని తీసుకుని తల్లి ఈ నెల  18న బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  విచారణ నిర్వహించారు. కేసు నమోదు చేశారు.  

ఈ కేసులో మురళీ ముకుంద్ తనయుడు ఆకాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  బాధితురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెపై తప్పుడు కేసు బనాయించారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.  నిందితులపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు  ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.మురళీ ముకుంద్ ను అరెస్ట్ చేశారు. ఇవాళ  నాంపల్లి జడ్జి నివాసంలో హాజరుపర్చారు. మురళీ ముకుంద్ కు  14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్ ను విధించారు  నాంపల్లి కోర్టు .కోర్టు ఆదేశాల మేరకు  పోలీసులు మురళీ ముకుంద్ ను రిమాండ్ కు తరలించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios