భార్యపై కాల్పులు జరిపిన భర్త, మద్యం మత్తులో...

Husband arrested after firing a gun at her wife
Highlights

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి  ఆ మత్తులో తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. భార్యాభర్తల మద్య చెలరేగిన చిన్న వివాధానికే రెచ్చిపోయిన భర్త భార్యపై గన్ తో కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచుసుకుంది. 

తిమ్మాపూర్ మండలకేంద్రంలోని రామకృష్ణాపూర్ బుడగజంగాల కాలనీలో తూర్పాటి కనకయ్య-స్వప్న దంపతులు నివాసముంటున్నారు. అయితే కనకయ్య మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇలాగే శుక్రవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్న కన్నకయ్య భార్యతో అకారణంగా గొడవకు దిగాడు. ఈ ఘర్షణ లో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగాయి. దీంతో కోపోద్రిక్తుడైన కనకయ్య భార్యను తుపాకీతో కాల్చాడు. తుపాకీ చప్పుడు విని ఇరుగుపొరుగు వారు చేరుకునే సరికి స్వప్న రక్తపుమడుగులో పడిఉంది.

దీంతో వారు స్వప్నను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె శరీరం నుండి బుల్లెట్లు తీసివేసి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధిత మహిళ భర్త కనకయ్యకు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి వద్దకు తుపాకీ ఎలా వచ్చింది?  ఎవరు సరఫరా చేశారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
 
loader