Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. విద్యార్ధులే టార్గెట్

తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ (medchal district) జిల్లాలలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 4.92 కేజీల మెపిడ్రెన్ డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పారిపోయారు.

huge drugs seized in medchal district
Author
Hyderabad, First Published Oct 23, 2021, 2:56 PM IST

తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ (medchal district) జిల్లాలలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 4.92 కేజీల మెపిడ్రెన్ డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పారిపోయారు. వీరి కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ (enforcement officials) అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. విద్యార్ధులకు సరఫరా చేసేందుకు నిందితులు డ్రగ్స్‌‌ను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా.. గంజాయి సాగుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. గంజాయి సాగు చేస్తే రైతుబంధు (rythu bandhu scheme) , రైతు బీమా రద్దు (rythu bheema) చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌వో‌ఎఫ్‌ఆర్‌లో సాగు చేస్తే పట్టాలు రద్దు అని సీఎం హెచ్చరించారు. త్వరలోనే డ్రగ్స్ నియంత్రణపై మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఒక్క గంజాయి మొక్క కూడా కనిపించకూడదని.. పాళశాల పుస్తకాల్లో డ్రగ్స్ ప్రమాదంపై సిలబస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి లభ్యత పెరిగిందని.. నిర్లక్ష్యం చేస్తే చేయిదాటే ప్రమాదం వుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read:గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా కట్: కేసీఆర్ సంచలన నిర్ణయం

అంతకుముందు గంజాయిపై యుద్ధం ప్రకటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.drugs, గంజాయి నిర్మూలన కోసం బుధవారం నాడు ప్రగతిభవన్ లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Ganja అక్రమసాగు వినియోగంపై ఉక్కు పాదం మోపాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతుందన్నారు.పరిస్థితి తీవ్రం కాకముందే గంజాయిని అరికట్టాల్సిన అవసరం గురించి ఆయన నొక్కి చెప్పారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారన్నారు. 

తెలిసీ తెలియక యువత బారినపడుతున్నారు.డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పారు.ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.గంజాయిపై డీజీ స్థాయి అధికారి నియమిస్తామని Kcrప్రకటించారు.విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇంటలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.గుడుంబా, గ్యాంబ్లింగ్ మళ్లీ వస్తున్నాయని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు.గంజాయి సాగుకు పాల్పడే నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios