ఎవరీ కల్యాణి: యాదాద్రి సెక్స్ రాకెట్ ఎలా వెలుగు చూసింది?

How the Yadagirigutta sex rocket revealed?
Highlights

తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యాదాద్రి సెక్స్ రాకెట్ విచిత్రమైన పరిస్థితిలో వెలుగు చూసింది. యాదాద్రి పట్టణంలోని కల్యాణి అమే మహిళ ఇంట్లోంచి తెంపు లేకుండా బాలిక ఏడుపులు వినిపించాయి. 

యాదాద్రి: తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యాదాద్రి సెక్స్ రాకెట్ విచిత్రమైన పరిస్థితిలో వెలుగు చూసింది. యాదాద్రి పట్టణంలోని కల్యాణి అమే మహిళ ఇంట్లోంచి తెంపు లేకుండా బాలిక ఏడుపులు వినిపించాయి. 
 
కల్యాణి గతంలో వ్యభిచార గృహాన్ని నిర్వహించిందనే విషయం తెలియడం వల్ల వారు ఆ ఏడుపులను తీవ్రంగా పరిగణించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 30న తనిఖీలకు వెళ్లిన పోలీసులకు కల్యాణి ఇంట్లో ఇద్దరు బాలికలు కనిపించారు. 

వారిలో ఓ బాలిక ఏకధాటిగా ఏడుస్తుండడంతో ఆమె గురించి పోలీసులు ప్రశ్నించారు. అయితే తమ బంధువుల అమ్మాయేనని నమ్మించడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు పట్టువిడకుండా ప్రశ్నించారు. బాలికను వేరే ప్రాంతం నుంచి తెచ్చినట్లు అంగీకరించింది. తాను పూర్తిగా మారిపోయానని కల్యాణి స్థానికులను నమ్మిస్తూ వచ్చింది. కానీ ఆమె మారలేదని, తన వృత్తిని వీడలేదని తేలింది.

కల్యాణి ఇంట్లోని బాలికకు పోలీసులు విముక్తి కలిగించారు. అదే రోజు కల్యాణి బంధువుల ఇళ్లల్లో దాడులు నిర్వహించి మరో 10మంది బాలికలను పోలీసులు రక్షించారు. మర్నాడు మరో నలుగురి బాలికలకు విముక్తి కలిగించారు. 

బాధిత చిన్నారులు ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లులోని ఉజ్వల హోమ్స్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 11మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. 
హార్మోన్ల వృద్ధి కోసం బాలికలకు ఇంజెక్షన్లు చేస్తున్నట్టుగా తేలడంతో యాదాద్రిలోని అనురాధ నర్సింగ్‌ హోంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు సీజ్‌ చేశారు.

loader