Asianet News TeluguAsianet News Telugu

ఓయూ ప్రోఫెసర్ కాశీం అరెస్ట్: విచారణ 23కు వాయిదా

ఓయూ ప్రోఫెసర్ కాశీం కేసును ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. 

High court orders to telangana government to file counter before jan 23
Author
Hyderabad, First Published Jan 19, 2020, 1:56 PM IST

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ప్రోఫెసర్ కాశీం అరెస్ట్‌కు సంబంధించి సమగ్ర సమాచారంతో  కౌంటర్ దాఖలు చేయాలని  తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నెల 18వ తేదీన కాశీం  ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీం భార్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఆదివారం నాడు చీఫ్ జస్టిస్  రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నివాసంలో  వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు గజ్వేల్ పోలీసులు ప్రోఫెసర్ కాశీంను హాజరుపర్చారు.

Also read:హైకోర్టు సీజే ఎదుట కాశీం: కొనసాగుతున్న వాదనలు

సుమారు రెండు గంటలపాటు ఈ పిటిషన్‌పై విచారణ సాగింది.  ఈ నెల 23వ తేదీ వరకు ప్రోఫెసర్ కాశీం అరెస్ట్‌కు సంబంధించి సమగ్ర  సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

చీఫ్ జస్టిస్ ఆదేశం మేరకు కాశీం చీఫ్ జస్టిస్  రాఘవేంద్ర సింగ్ చౌహన్ నివాసంలోనే కుటుంబసభ్యులను కలుసుకొన్నారు.ఈ కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios