మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నవారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. సోమాజిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి ఎదురుగా గల హిల్స్‌ బ్యూటీ స్పా మసాజ్‌ సెంటర్‌పై సోమవారం రాత్రి పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సంఘటనలో విటులు ఫిరోజ్‌ఖాన్‌ (25), హరీష్‌రెడ్డి (25), ఎం.రాజేష్‌ (22)లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మసాజ్‌ సెంటర్‌ నిర్వహించే మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, నగరానికి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు తదుపరి విచారణ నిమిత్తం అప్పగించారు.