ప్రియాంక రెడ్డి హత్య కేసు ఘటనతో హైదరాబాద్ నగరం వణికిపోయింది. ఆ ఘటన మరవక ముందే శంషాబాద్ సమీపంలోని సిద్దుల గుట్టలో మరో మహిళ అదే స్థితిలో కనపడింది. ఆమె కూడా సజీవదహనమై కనిపించింది. ఈ వరస రెండు ఘటనలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. 

నగరంలో ఏం జరుగుతోందని ఆమె అన్నారు. ‘‘ అసలు ఏం జరుగుతోంది... ఈ ఘోరాలేంటి’’ అని ఆరా తీసినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులో ప్రియాంక రెడ్డిపై గ్యాంగ్ రేప్, హత్య, వరంగల్ లో మానసపై హత్యాచారం ఘటనలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా... శుక్రవారం గవర్నర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ కలిశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణీంచాయని, హత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని గవర్నర్ కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.