వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సామూహిక హత్యల విషయంలో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. గొర్రెకుంటలోని బావిలో 9 మంది మృతదేహాల మిస్టరీని ఛేదించగా వారందరినీ సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి చంపినట్లు తేలింది. అతన్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. 

పోలీసు విచారణలో సంజయ్ కుమార్ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతనిపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సంజయ్ కుమార్ యాదవ్ మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు గీసుకొండ సీఐ శివరామయ్య చెప్పారు. 

Also Read: గొర్రెకుంట సామూహిక హత్యలు: వెలుగులోకి విస్తుబోయే విషయాలు

ఇదిలావుంటే, 14 ఏళ్ల వయస్సు గల రఫికా కూతురిపై సంజయ్ కుమార్ యాదవ్ పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసు విచారణలో తేలినట్లు సమాచారం. రఫిక కూతురి మీద అత్యాచారం చేసిన విషయాన్ని అతను పోలీసు విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. 

వరంగల్ లోని ఓ ఇంట్లో రఫిక కూతురికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమె గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని ప్రచారం జరుగుతోంది. బాలికను బలవంతగా లొంగదీసుకుని ఐదు నెలలు రేప్ చేసినట్లు తేలిందని అంటున్నారు. దాంతో అతనిపై అత్యాచారం, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

Also Read: నిద్రమాత్రలు వేసి రఫికా కూతురిపైనా సంజయ్ అత్యాచారం?

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో గోనె సంచుల గోదాం సమీపంలోని బావిలో 9 మంది మృతదేహాలు తేలడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసును 72 గంటల్లో ఛేదించి నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేశారు. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ కస్టడీ గురువారంతో ముగిసింది. దీంతో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు.