కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణమైన, అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు వ్యక్తుకు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు ఆమెపై అఘాయిత్యం చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను బాలికను అస్పత్రికి తీసుకుని వెళ్లగా ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కరీంనగర్ లోని అంబేడ్కర్ నగర్ కు చెందిన 9 ఏల్ల బాలిక ఆదర్శనగర్ లో మూడో తరగతి చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో జ్వరం కారణంగా బాలిక ఇంటి వద్దే ఉంటోంది. 

వారి ఇంటికి సమీపంలో ఉండే వినోద్ (20) సోమవారంనాడు ఆడుకుందాం రావాలని బాలికను తీసుకెళ్లాడు. ఆ తర్వాత అత్యాచారం చేశాడు. ఆ విషం రవితేజ (18)కు, మరో బాలుడికి చెప్పాడు. ముగ్గురు కలిసి మంగళ, బుధవారాల్లో బాలికపై అత్యాచారం చేశారు. 

బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకుని వెల్లింది. దాంతో విషయం బయటపడింది. త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.