హైదరాబాద్: తెలంగాణలోని శంషాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై కామాంధుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచార దృశ్యాలను యువకుడు సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. బెదిరింపులకు పాల్పడుతూ బాలికపై కామాంధుడు అత్యాచారం చేస్తూ వచ్చాడు.

విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని నిందితుడు బాలికను బెదిరిస్తూ వచ్చాడు. అంతేకాకుండా తన వద్ద గన్ ఉందని, దాంతో తల్లిదండ్రులను కాల్చేస్తానని కూడా బెదిరిస్తూ వచ్చాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోతూ వచ్చింది. 

చివరకు విషయం బయటకు రావడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్్డటరానికి చెందిన గోపిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.