జిహెచ్ఎంసి ఎన్నికల లైవ్ అప్ డేట్: కొద్దిసేపట్లో ముగియనున్న పోలింగ్

GHMC Election live updates

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం ఆరుగంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.  కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎస్ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

6:07 PM IST

పువ్వాడ అజయ్‌‌ని బర్తరఫ్ చేయండి: సీపీఐ నారాయణ

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల కమీషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద అజయ్ అనైతికంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ప్రజలు తిరగబడితే అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. పోలీసులు స్పందించి మంత్రి అజయ్‌‌పై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. 
 
5:52 PM IST

మరికొద్దిసేపట్లో ముగియనున్న జీహెచ్‌ఎంసీ పోలింగ్

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మరి కొద్దిసేపట్లో ముగియనుంది. కోవిడ్ భయం కారణంగా ఓటర్లు ఓటింగ్‌కు అంతగా మొగ్గుచూపలేదు. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం కాస్త తర్వాత పుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గాను సాయంత్రం 4 గంటల నాటికి 50 శాతం పోలింగ్ నమోదైంది. చాలా చోట్ల 20 శాతానికి కూడా పోలింగ్ చేరలేదు. వరుస సెలవులు పోలింగ్‌ శాతంపై బాగా ప్రభావం చూపాయి. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో వున్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.
 
3:28 PM IST

జాంబాగ్ లో ఉద్రిక్తత.. టీఆర్ఎస్ అభ్యర్థిపై ఎంఐఎం నేతల దాడియత్నం

జాంబాగ్ డివిజన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం నాయకులు దాడికి యత్నించారు. జూబ్లీ హైస్కూల్ లో రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని తెలిసి తాను అక్కడికి వెళ్లగా ఎంఐఎం నాయకులు అడ్డుకుని దాడికి ప్రయత్నించారని ఆనంద్ గౌడ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. 

3:28 PM IST

దారుణం... మధ్యాహ్నం 3గంటలవరకు 25.34 పోలింగ్

హైదరాబాద్ ప్రజలు ఓటేయడానికి అనాసక్తి ప్రదర్శిస్తుండటంతో పోలింగ్ శాతం అత్యంత దారుణంగా నమోదవుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 
25.34 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 

3:11 PM IST

నాచారం టీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి

నాచారం పరిధిలోని ఆరో డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.  

3:06 PM IST

డిప్యూటీ స్పీకర్ తనయుడు, బిజెపి నాయకుల గొడవ

వారాసిగూడల కొడుకు టీఆర్ఎస్, బిజెపి నాయకులు బాహాబాహీకి దిగారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు కిరణ్ బిజెపి నేతలకు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఓటర్లను ప్రలోబాలకు గురిచేస్తుండగా తాము అడ్డుకున్నామని... అందువల్లే కిరణ్ తమపై దాడికి పాల్పడ్డాడని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
3:03 PM IST

తీరు మారలేదు... మద్యాహ్నం 2గంటలకు 24శాతం పోలింగ్

 గ్రేటర్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి బద్దకిస్తున్నారో లేక హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారో తెలీదు కాని ఓటెసేందుకు మాత్రం ఆసక్తి చూపడంలేదు. దీంతో ఓటింగ్ శాతం అతి దారుణంగా నమోదవుతోంది. మద్యాహ్నం 2గంటల వరకు 24.52 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 
 
2:58 PM IST

జీడిమెట్లలో ఉద్రిక్తత... టీఆర్ఎస్, బిజెపి వాగ్వాదం

జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య  వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణ ఏర్పడింది. అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

2:33 PM IST

లింగంపల్లిలో ఉద్రిక్తత... బిజెపి, టిఆర్ఎస్ శ్రేణులు ఘర్షణ

లింగంపల్లిలో బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పాపిరెడ్డి కాలనీలోని పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. 
 
2:06 PM IST

ఓటేసిన మైహోమ్స్‌ అధినేత రామేశ్వరరావు

జూబ్లిహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రామేశ్వరరావు, భార్య శ్రీకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

1:38 PM IST

దారుణం... అమీర్ పేటలో ఇప్పటికీ 0.79శాతం పోలింగ్

జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో ఒంటిగంట వరకు గుడి మల్కాపూర్ లో అత్యధికంగా 49.19 శాతం నమోదవగా అత్యల్పంగా అమీర్ పేటలో 0.79శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 
1:38 PM IST

సికింద్రాబాద్ పరిధిలోని డివిజన్లలో ఓటింగ్ శాతం

1) 142 అడ్డగుట్ట 12 శాతం పోలింగ్ నమోదు అయ్యింది

2) 145 సీతాఫలమండి 12.01 శాతం పోలింగ్ నమోదైంది.
3) 146 బౌద్ధ నగర్ 12.50 శాతం పోలింగ్ నమోదైంది.
4) 144 మెట్టుగూడ 11.75 శాతం పోలింగ్ నమోదైంది.

5) 147బన్సలలపెట్ 16.1 శాతం పోలింగ్ నమోదైంది.

6) 148 రాంగోపాల్ పేట్ 6.33 శాతం పోలింగ్ నమోదైంది.
7) 149 బేగంపేట్ 12.01 శాతం పోలింగ్ నమోదైంది.
8) 150 మొండ మార్కెట్ 10.16 శాతం పోలింగ్ నమోదైంది.
9) 119 డివిషన్ బోయినపల్లి 14.06 శాతం పోలింగ్ నమోదైంది. 

1:27 PM IST

పోలింగ్ బూత్ ముందు బిజెపి అభ్యర్థి ధర్నా

బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని పోలింగ్ బూత్ 60, 61 లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బిజెపి అభ్యర్థి ఆందోళనకు దిగారు. పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్యకర్తలతో కలిసి అభ్యర్థి లచ్చిరెడ్డి ధర్నాకు దిగారు. 
  
1:17 PM IST

నత్తనడకన పోలింగ్... మద్యాహ్నం 1గంట వరకు 18.20శాతం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ అత్యంత మందకోడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు కేవలం 18.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 

12:54 PM IST

బూటు కాలితో తంతూ... సీఐపై బిజెపి నాయకుల ఆరోపణ

జగద్గిరిగుట్ట సీఐ దీనబందు కాలనీలోని పోలింగ్ బూత్ వద్ద తమపై దురుసుగా ప్రవర్తించాడని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటర్లకు స్లిప్పులు అందించడానికి ఏర్పాటు చేసుకున్న టెబుల్ ను బూటుకాలితో తంతూ వీరంగం సృష్టించాడని... కొందరిని దుర్బాషలాడుతూ దాడి కూడా చేశాడని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
12:54 PM IST

మార్ఫింగ్ ఓటర్ ఐడీలతో దొంగఓట్లు

ఉప్పల్ లో మార్పింగ్ ఐడి కార్డులతో ఓటేయడానికి వచ్చిన ఇద్దరిని టీఆర్ఎస్ నాయకులు గుర్తించి అడ్డుకున్నారు.  కాంగ్రెస్‌ నాయకులు సూర్యాపేట నుంచి వీరిని తీసుకొచ్చి దొంగ ఓటు వేయించడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. 

12:48 PM IST

నాచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణ

నాచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు కండువాలు ధరించి పోలింగ్ స్టేషన్ల వద్దకు వస్తున్నారంటూ వారిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకర పరస్థితి ఏర్పడింది.

12:34 PM IST

కాంగ్రెస్ నాయకులు మల్లు రవి ఓటు గల్లంతు

గ్రేటర్ ఎన్నికల్లో ఎస్ఈసీ తప్పిదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తమ ఓట్లు గల్లంతయినట్లు సామాన్య ఓటర్లు ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి ఓటు కూడా గల్లంతయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఓటు వెయ్యలేకపోతున్నారు. 
 
12:22 PM IST

రేపే ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్

పార్టీల గుర్త తారుమారు అవడంతో ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే రీపోలింగ్ రేపే(బుధవారం) నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ అధికారులు ప్రకటించారు. 

11:58 AM IST

ఎంఐఎం, బిజెపి నేతల వాగ్వాదం... ఫలక్ నుమాలో ఉద్రిక్తత

పాతబస్తీలోని ఫలక్ నుమా పరిధిలోని జంగంమెట్ డివిజన్ బూత్ నెంబర్ 21, 22 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరు పడితే వారు పోలింగ్ బూత్ లోకి ఎలా వస్తారంటూ ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించుకోవడంతోపాటుగా.... తోసుకున్నారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అక్కడినుండి పంపించివేశారు.

11:58 AM IST

ఓటేసిన హోంమంత్రి మహమూద్ అలీ

మలక్ పేటలో రాష్ట్ర హోంశాఖ  మంత్రి మహమూద్  అలీ కుటుంబంతో కలిసివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేవి చాలా ముఖ్యమైంది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగరవాసులు ముందుకు రావాలని కోరారు. 

11:58 AM IST

ఓటేసిన ఎమ్మెల్సీ కవిత

బంజారాహిల్స్ వెంకటేశ్వరరావు కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కూతురు కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

11:55 AM IST

గోపన్ పల్లిలో టీఆర్ఎస్, బిజెపి శ్రేణుల బాహాబాహీ

గచ్చిబౌలిలోని గోపన్ పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. 

11:48 AM IST

ఎగ్జిట్ పోల్ నిషేధం

 ఓల్డ్ మలక్ పేటలో పార్టీల గుర్తులు తారుమారయిన నేపథ్యంలో పోలింగ్ ను రద్దు చేసిన ఈసీ రిపోలింగ్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకుండా నిషేదం విధించినట్లు ఈసీ వెల్లడించింది. 
 
11:41 AM IST

ఓటేసిన విజయ్ దేవరకొండ

 గ్రేటర్ ఎన్నికల్లో రౌడీ విజయ్ దేవరకొండ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేసాడు. విజయ్ దేవరకొండతో పాటు అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఓటేసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.

11:33 AM IST

ఊపందుకోని పోలింగ్... ఇప్పటివరకు 8.90శాతమే

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోలింగ్ మందకోడిగా సాగుతోంది. 11గంటల వరకు కేవలం 8.90 శాతం పోలింగ్ నమోదయినట్లు ఈసీ ప్రకటించింది. 

11:22 AM IST

కూకట్ పల్లిలో ఉద్రిక్తత

మంత్రి పువ్వాడ అజయ్ కు చెందిన కారులో వచ్చి ఆయన అనుచరులు కూకట్ పల్లిలో డబ్బులు పంచుతున్నారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోరం మాల్ వద్ద మంత్రి కారుగా పేర్కొంటూ అందులో వున్న వ్యక్తిపై బిజెపి కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.  

11:17 AM IST

పోలింగ్ కేంద్రాలను చూస్తే బాధగా వుంది: సినీనటులు రాజేంద్రప్రసాద్

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేస్‌ పోలింగ్‌ బూత్‌  సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్లు లేని పోలింగ్ కేంద్రాలను చూస్తే బాధగా వుందన్నారు. ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.  
 
10:52 AM IST

ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు

 ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దయింది. తమ గుర్తు తారుమారు అయ్యిందని సిపిఐ నేతలు ఫిర్యాదు చేయడంతో పరిశీలించిన ఈసీ అధికారులు నిజమేనని తేల్చారు. దీంతో పోలింగ్ ను రద్దు చేసి తర్వాత నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును ఓటింగ్ స్లిప్ పై ముద్రించారు. 

10:52 AM IST

గ్రేటర్ పోరులో మాస్కుల రగడ

ఎన్బీటి నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి నాయకులు కాషాయ రంగు మాస్కుల ధరించి పోలింగ్ కేంద్రం వద్దకు రావడాన్ని టీఆర్ఎస్ నాయకులు తప్పుబట్టారు. అయితే టీఆర్ఎస్ నాయకులు గులాబీ కండువాలతో రావడాన్ని బిజెపి తప్పుబట్టింది. దీంతో ఇరుపార్టీల నాయకులు వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
10:37 AM IST

ఆజాంపురాలో దొంగఓట్లు... పోలీసుల అదుపులో ఆరుగురు మహిళలు

పాతబస్తీ పరిధిలోని ఆజాంపురాలో దొంగఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10:33 AM IST

ఓటుహక్కును వినియోగించుకున్న మంత్రి తలసాని

వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

10:29 AM IST

ఓటుహక్కును వినియోగించుకున్న మంచు లక్ష్మి, ఝాన్సీ

 తెలుగు సీనీతార మంచు లక్ష్మి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే యాంకర్, సినీనటి ఝూన్సీ కూడా ఓటేశారు. 

10:23 AM IST

తార్నాకలో ఓటేసిన కోదండరాం దంపతులు

 టిజెఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రోఫెసర్ కోదండరాం తార్నాకలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చిన ఆయన ఓటేశారు. 

10:18 AM IST

జీవితంలో రెండో సారి ఓటేసిన గద్దర్

విప్లవ గాయకుడు గద్దర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకుని వచ్చి ఆయన ఓటేశారు. 

10:00 AM IST

ఓటేసిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్

జూబ్లీ హిల్స్  కోపరేటివ్ హోసింగ్ సొసైటీ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సమాచార శాఖ కమీషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్. 

9:57 AM IST

పటాన్ చెరులో బిజెపి-టీఆర్ఎస్ నాయకుల ఘర్షణ

పటాన్ చెరులోని చైతన్యనగర్ కాలనీలో టీఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి  ఓ దళిత బిజెపి నాయకుడిపై దాడి చేశాడని బిజెపి అభ్యర్థి ఆరోపించాడు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.   .  

9:52 AM IST

సంగారెడ్డి జిల్లా పరిధిలో అధికంగా ఓటింగ్ శాతం

మొదటిగంటలో పటాన్ చెరులో 7.72శాతం పోలింగ్ నమోదవగా భారతి నగర్ లో 8.97, ఆర్సి పురంలో 10.26 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

9:43 AM IST

ఓటేసిన నాగార్జున-అమల దంపతులు

ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున భార్య అమలతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
 
9:43 AM IST

ఓటేసిన పోలీస్ బాస్

కుందన్ బాగ్ లో డిజిపి మహేందర్ రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

9:41 AM IST

ఓటేసిన దానం నాగేందర్

బంజారాహిల్స్ లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 
 
9:14 AM IST

మొదటి రెండు గంటల్లో 4.2 ఓటింగ్ శాతం

గ్రేటర్ లో పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో  4.2 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

9:14 AM IST

ఓటేసిన సీఎస్ కుటుంబం

9:00 AM IST

మందకోడిగా పోలింగ్, మొదటిగంటలో కేవలం 0.14శాతమే

 గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. పోలింగ్ ప్రారంబమైన మొదటి గంటలో కేవలం 0.14 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయ్యింది. ఓటు వేయడానికి నగర ప్రజలు ఆసక్తి చూపడంలేదన్నది ఈ పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తోంది. 

9:00 AM IST

కాచీగూడలో ఓటేసిన కిషన్ రెడ్డి దంపతులు

8:44 AM IST

ఓటేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లిలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. 

8:12 AM IST

తల్లితో కలిసొచ్చి ఓటేసిన హీరో నాగశౌర్య

టాలీవుడ్ హీరో నాగశౌర్య తల్లి ఉషతో కలిసివచ్చి షేక్‌పేట్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
8:12 AM IST

ఓటేసిన చిరంజీవి దంపతులు

8:09 AM IST

టీఆర్ఎస్ బిజెపి నాయకుల వాగ్వాదం... హఫీజ్ పేటలో  ఉద్రిక్తత

పోలింగ్ రోజు హఫీజ్ పేట్ పరిధిలో టీఆర్ఎస్ ప్లెక్సీలు వెలియడాన్ని బిజెపి నాయకులు వ్యతిరేకించారు. ఇరు పార్టీల నాయకుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది.  దీంతో టీఆర్ఎస్ నాయకులు ప్లెక్సీలను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. 

8:06 AM IST

ఓటేసిన హైదరాబాద్ సిపి

అంబర్ పేటలో ఓటుహక్కును వినియోగించుకున్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. 
 
7:59 AM IST

ఆర్కేపురంలో ఉద్రిక్తత

ఆర్కేపురం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఓటర్లను ప్రలోబాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
7:49 AM IST

నాంపల్లిలో ఓటేసిన సిపి సజ్జనార్

 నాంపల్లిలోని పోలింగ్ బూత్ లో సైబరాబాద్ సిపి సజ్జనార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన క్యూలో నిలబడి ఓటేశారు. 
 
7:49 AM IST

శాస్త్రిపురంలో ఓటేసిన అసదుద్దీన్ ఓవైసి

పాతబస్తీ శాస్త్రిపురంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. 

7:49 AM IST

ఓటేసిన కేటీఆర్ కుటుంబం

7:33 AM IST

జూబ్లీహిల్స్ లో ఓటేసిన చిరంజీవి

జూబ్లీహిల్స్ క్లబ్ లో ప్రముఖ సినీనటులు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సురేఖతో కలిసివచ్చిన ఆయన ఓటేశారు. 

7:33 AM IST

జూబ్లీహిల్స్ లో ప్రారంభంకాని పోలింగ్

జూబ్లీహిల్స్ లో పోలింగ్ ప్రారంభంకాలేదు. సిబ్బంది కొరతవల్లే పోలింగ్ ను ఇంకా ప్రారంభించలేదని అధికారులు తెలిపారు. వెంటనే పోలింగ్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

7:28 AM IST

కుందన్ బాగ్ లో ఓటేసిన మాదాపూర్ డిసిపి

కుందన్ బాగ్ పోలింగ్ కేంద్రంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:19 AM IST

బల్దియా పోలింగ్... కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ

కోవిడ్ నిబంధనలను అనుసరించి సాయంత్రం చివరి గంట కరోనా పేషంట్స్ కి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు అధికారులు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో కూడా శానిటైజర్ అందుబాటులో వుంచారు. అలాగే పోలింగ్ సిబ్బంది, ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాల్సి వుంటుంది. 

7:19 AM IST

ఓటుహక్కును వినియోగించుకున్న కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఓటేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటుహక్కు కలిగినవారు ఇంటినుండి బయటకువచ్చి ఓటేయాలని కోరారు. 

7:08 AM IST

ఓటేసిన మంత్రి కేటీఆర్

పోలింగ్ ప్రారంభంకాగానే బంజారాహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఓటేశారు.  కుటుంబంతో కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

6:07 PM IST:

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల కమీషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద అజయ్ అనైతికంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ప్రజలు తిరగబడితే అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. పోలీసులు స్పందించి మంత్రి అజయ్‌‌పై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. 
 
5:56 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మరి కొద్దిసేపట్లో ముగియనుంది. కోవిడ్ భయం కారణంగా ఓటర్లు ఓటింగ్‌కు అంతగా మొగ్గుచూపలేదు. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం కాస్త తర్వాత పుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గాను సాయంత్రం 4 గంటల నాటికి 50 శాతం పోలింగ్ నమోదైంది. చాలా చోట్ల 20 శాతానికి కూడా పోలింగ్ చేరలేదు. వరుస సెలవులు పోలింగ్‌ శాతంపై బాగా ప్రభావం చూపాయి. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో వున్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.
 
3:40 PM IST:

జాంబాగ్ డివిజన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం నాయకులు దాడికి యత్నించారు. జూబ్లీ హైస్కూల్ లో రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని తెలిసి తాను అక్కడికి వెళ్లగా ఎంఐఎం నాయకులు అడ్డుకుని దాడికి ప్రయత్నించారని ఆనంద్ గౌడ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. 

3:28 PM IST:

హైదరాబాద్ ప్రజలు ఓటేయడానికి అనాసక్తి ప్రదర్శిస్తుండటంతో పోలింగ్ శాతం అత్యంత దారుణంగా నమోదవుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 
25.34 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 

3:12 PM IST:

నాచారం పరిధిలోని ఆరో డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.  

3:07 PM IST:

వారాసిగూడల కొడుకు టీఆర్ఎస్, బిజెపి నాయకులు బాహాబాహీకి దిగారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు కిరణ్ బిజెపి నేతలకు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఓటర్లను ప్రలోబాలకు గురిచేస్తుండగా తాము అడ్డుకున్నామని... అందువల్లే కిరణ్ తమపై దాడికి పాల్పడ్డాడని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
3:03 PM IST:

 గ్రేటర్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి బద్దకిస్తున్నారో లేక హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారో తెలీదు కాని ఓటెసేందుకు మాత్రం ఆసక్తి చూపడంలేదు. దీంతో ఓటింగ్ శాతం అతి దారుణంగా నమోదవుతోంది. మద్యాహ్నం 2గంటల వరకు 24.52 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 
 
2:59 PM IST:

జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య  వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణ ఏర్పడింది. అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

2:34 PM IST:

లింగంపల్లిలో బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పాపిరెడ్డి కాలనీలోని పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. 
 
2:07 PM IST:

జూబ్లిహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రామేశ్వరరావు, భార్య శ్రీకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

1:49 PM IST:

జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో ఒంటిగంట వరకు గుడి మల్కాపూర్ లో అత్యధికంగా 49.19 శాతం నమోదవగా అత్యల్పంగా అమీర్ పేటలో 0.79శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 
1:39 PM IST:

1) 142 అడ్డగుట్ట 12 శాతం పోలింగ్ నమోదు అయ్యింది

2) 145 సీతాఫలమండి 12.01 శాతం పోలింగ్ నమోదైంది.
3) 146 బౌద్ధ నగర్ 12.50 శాతం పోలింగ్ నమోదైంది.
4) 144 మెట్టుగూడ 11.75 శాతం పోలింగ్ నమోదైంది.

5) 147బన్సలలపెట్ 16.1 శాతం పోలింగ్ నమోదైంది.

6) 148 రాంగోపాల్ పేట్ 6.33 శాతం పోలింగ్ నమోదైంది.
7) 149 బేగంపేట్ 12.01 శాతం పోలింగ్ నమోదైంది.
8) 150 మొండ మార్కెట్ 10.16 శాతం పోలింగ్ నమోదైంది.
9) 119 డివిషన్ బోయినపల్లి 14.06 శాతం పోలింగ్ నమోదైంది. 

1:28 PM IST:

బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని పోలింగ్ బూత్ 60, 61 లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బిజెపి అభ్యర్థి ఆందోళనకు దిగారు. పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్యకర్తలతో కలిసి అభ్యర్థి లచ్చిరెడ్డి ధర్నాకు దిగారు. 
  
1:17 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ అత్యంత మందకోడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు కేవలం 18.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 

1:14 PM IST:

జగద్గిరిగుట్ట సీఐ దీనబందు కాలనీలోని పోలింగ్ బూత్ వద్ద తమపై దురుసుగా ప్రవర్తించాడని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటర్లకు స్లిప్పులు అందించడానికి ఏర్పాటు చేసుకున్న టెబుల్ ను బూటుకాలితో తంతూ వీరంగం సృష్టించాడని... కొందరిని దుర్బాషలాడుతూ దాడి కూడా చేశాడని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
12:54 PM IST:

ఉప్పల్ లో మార్పింగ్ ఐడి కార్డులతో ఓటేయడానికి వచ్చిన ఇద్దరిని టీఆర్ఎస్ నాయకులు గుర్తించి అడ్డుకున్నారు.  కాంగ్రెస్‌ నాయకులు సూర్యాపేట నుంచి వీరిని తీసుకొచ్చి దొంగ ఓటు వేయించడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. 

12:48 PM IST:

నాచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు కండువాలు ధరించి పోలింగ్ స్టేషన్ల వద్దకు వస్తున్నారంటూ వారిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకర పరస్థితి ఏర్పడింది.

12:35 PM IST:

గ్రేటర్ ఎన్నికల్లో ఎస్ఈసీ తప్పిదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తమ ఓట్లు గల్లంతయినట్లు సామాన్య ఓటర్లు ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి ఓటు కూడా గల్లంతయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఓటు వెయ్యలేకపోతున్నారు. 
 
12:23 PM IST:

పార్టీల గుర్త తారుమారు అవడంతో ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే రీపోలింగ్ రేపే(బుధవారం) నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ అధికారులు ప్రకటించారు. 

12:16 PM IST:

పాతబస్తీలోని ఫలక్ నుమా పరిధిలోని జంగంమెట్ డివిజన్ బూత్ నెంబర్ 21, 22 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరు పడితే వారు పోలింగ్ బూత్ లోకి ఎలా వస్తారంటూ ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించుకోవడంతోపాటుగా.... తోసుకున్నారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అక్కడినుండి పంపించివేశారు.

12:10 PM IST:

మలక్ పేటలో రాష్ట్ర హోంశాఖ  మంత్రి మహమూద్  అలీ కుటుంబంతో కలిసివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేవి చాలా ముఖ్యమైంది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగరవాసులు ముందుకు రావాలని కోరారు. 

11:58 AM IST:

బంజారాహిల్స్ వెంకటేశ్వరరావు కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కూతురు కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

11:55 AM IST:

గచ్చిబౌలిలోని గోపన్ పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. 

11:48 AM IST:

 ఓల్డ్ మలక్ పేటలో పార్టీల గుర్తులు తారుమారయిన నేపథ్యంలో పోలింగ్ ను రద్దు చేసిన ఈసీ రిపోలింగ్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకుండా నిషేదం విధించినట్లు ఈసీ వెల్లడించింది. 
 
11:42 AM IST:

 గ్రేటర్ ఎన్నికల్లో రౌడీ విజయ్ దేవరకొండ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేసాడు. విజయ్ దేవరకొండతో పాటు అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఓటేసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.

11:33 AM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోలింగ్ మందకోడిగా సాగుతోంది. 11గంటల వరకు కేవలం 8.90 శాతం పోలింగ్ నమోదయినట్లు ఈసీ ప్రకటించింది. 

11:22 AM IST:

మంత్రి పువ్వాడ అజయ్ కు చెందిన కారులో వచ్చి ఆయన అనుచరులు కూకట్ పల్లిలో డబ్బులు పంచుతున్నారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోరం మాల్ వద్ద మంత్రి కారుగా పేర్కొంటూ అందులో వున్న వ్యక్తిపై బిజెపి కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.  

11:18 AM IST:

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేస్‌ పోలింగ్‌ బూత్‌  సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్లు లేని పోలింగ్ కేంద్రాలను చూస్తే బాధగా వుందన్నారు. ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.  
 
11:13 AM IST:

 ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దయింది. తమ గుర్తు తారుమారు అయ్యిందని సిపిఐ నేతలు ఫిర్యాదు చేయడంతో పరిశీలించిన ఈసీ అధికారులు నిజమేనని తేల్చారు. దీంతో పోలింగ్ ను రద్దు చేసి తర్వాత నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును ఓటింగ్ స్లిప్ పై ముద్రించారు. 

10:53 AM IST:

ఎన్బీటి నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి నాయకులు కాషాయ రంగు మాస్కుల ధరించి పోలింగ్ కేంద్రం వద్దకు రావడాన్ని టీఆర్ఎస్ నాయకులు తప్పుబట్టారు. అయితే టీఆర్ఎస్ నాయకులు గులాబీ కండువాలతో రావడాన్ని బిజెపి తప్పుబట్టింది. దీంతో ఇరుపార్టీల నాయకులు వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
10:37 AM IST:

పాతబస్తీ పరిధిలోని ఆజాంపురాలో దొంగఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10:34 AM IST:

వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

10:31 AM IST:

 తెలుగు సీనీతార మంచు లక్ష్మి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే యాంకర్, సినీనటి ఝూన్సీ కూడా ఓటేశారు. 

10:24 AM IST:

 టిజెఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రోఫెసర్ కోదండరాం తార్నాకలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చిన ఆయన ఓటేశారు. 

10:19 AM IST:

విప్లవ గాయకుడు గద్దర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకుని వచ్చి ఆయన ఓటేశారు. 

10:01 AM IST:

జూబ్లీ హిల్స్  కోపరేటివ్ హోసింగ్ సొసైటీ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సమాచార శాఖ కమీషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్. 

9:57 AM IST:

పటాన్ చెరులోని చైతన్యనగర్ కాలనీలో టీఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి  ఓ దళిత బిజెపి నాయకుడిపై దాడి చేశాడని బిజెపి అభ్యర్థి ఆరోపించాడు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.   .  

9:53 AM IST:

మొదటిగంటలో పటాన్ చెరులో 7.72శాతం పోలింగ్ నమోదవగా భారతి నగర్ లో 8.97, ఆర్సి పురంలో 10.26 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

9:49 AM IST:

ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున భార్య అమలతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
 
9:44 AM IST:

కుందన్ బాగ్ లో డిజిపి మహేందర్ రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

9:42 AM IST:

బంజారాహిల్స్ లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 
 
9:17 AM IST:

గ్రేటర్ లో పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో  4.2 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

9:15 AM IST:

9:09 AM IST:

 గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. పోలింగ్ ప్రారంబమైన మొదటి గంటలో కేవలం 0.14 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయ్యింది. ఓటు వేయడానికి నగర ప్రజలు ఆసక్తి చూపడంలేదన్నది ఈ పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తోంది. 

9:01 AM IST:

8:45 AM IST:

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లిలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. 

8:33 AM IST:

టాలీవుడ్ హీరో నాగశౌర్య తల్లి ఉషతో కలిసివచ్చి షేక్‌పేట్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
8:13 AM IST:

8:10 AM IST:

పోలింగ్ రోజు హఫీజ్ పేట్ పరిధిలో టీఆర్ఎస్ ప్లెక్సీలు వెలియడాన్ని బిజెపి నాయకులు వ్యతిరేకించారు. ఇరు పార్టీల నాయకుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది.  దీంతో టీఆర్ఎస్ నాయకులు ప్లెక్సీలను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. 

8:07 AM IST:

అంబర్ పేటలో ఓటుహక్కును వినియోగించుకున్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. 
 
7:59 AM IST:

ఆర్కేపురం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఓటర్లను ప్రలోబాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
7:55 AM IST:

 నాంపల్లిలోని పోలింగ్ బూత్ లో సైబరాబాద్ సిపి సజ్జనార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన క్యూలో నిలబడి ఓటేశారు. 
 
7:52 AM IST:

పాతబస్తీ శాస్త్రిపురంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. 

7:50 AM IST:

7:40 AM IST:

జూబ్లీహిల్స్ క్లబ్ లో ప్రముఖ సినీనటులు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సురేఖతో కలిసివచ్చిన ఆయన ఓటేశారు. 

7:34 AM IST:

జూబ్లీహిల్స్ లో పోలింగ్ ప్రారంభంకాలేదు. సిబ్బంది కొరతవల్లే పోలింగ్ ను ఇంకా ప్రారంభించలేదని అధికారులు తెలిపారు. వెంటనే పోలింగ్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

7:28 AM IST:

కుందన్ బాగ్ పోలింగ్ కేంద్రంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:22 AM IST:

కోవిడ్ నిబంధనలను అనుసరించి సాయంత్రం చివరి గంట కరోనా పేషంట్స్ కి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు అధికారులు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో కూడా శానిటైజర్ అందుబాటులో వుంచారు. అలాగే పోలింగ్ సిబ్బంది, ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాల్సి వుంటుంది. 

7:19 AM IST:

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఓటేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటుహక్కు కలిగినవారు ఇంటినుండి బయటకువచ్చి ఓటేయాలని కోరారు. 

7:11 AM IST: