జీహెచ్ఎంసీ ఎన్నికలు: వికసించిన కమలం... కారుకు బ్రేకులు

GHMC Election Counting Live Updates

హైదరాబాద్:  జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం ఇవాళ(శుక్రవారం)తేలనుంది. ఈ ఓట్ల లెక్కింపు కోసం నగరంలో మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.ఈ కౌటింగ్ కోసం 8152 సిబ్బందిని ఉపయోగిస్తున్నారు.

5:56 PM IST

కూకట్‌పల్లి సర్కిల్‌లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్

కూకట్‌పల్లి సర్కిల్‌ని టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. సర్కిల్‌ పరిధిలోని మొత్తం 6 డివిజన్లను కైవసం చేసుకుంది. ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, వివేకానంద నగర్, హైదర్‌నగర్, అల్విన్ కాలనీలను కారు సొంతం చేసుకుంది. 

5:30 PM IST

మేయర్ బొంతు రామ్మోహన్ భార్య విజయం

చర్లపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి విజయం సాధించారు. 

5:25 PM IST

వనస్థలిపురంలో బీజేపీ పాగా

వనస్థలిపురం డివిజన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్ధి రాగుల వెంకటేశ్వర్ రెడ్డి 702 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

5:18 PM IST

స్పష్టత దిశగా గ్రేటర్ తీర్పు

జీహెచ్ఎంసీ ఎన్నికల తీర్పు స్పష్టత దిశగా వస్తోంది. 42 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం ఖరారైంది. 39 డివిజన్లలో ఎంఐఎం గెలుపొందింది. 25 డివిజన్లలో బీజేపీ అభ్యర్ధులు గెలుపొందారు. 2 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.  

4:44 PM IST

పార్టీల ప్రస్తుత పరిస్ధితి ఇది

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 90 స్థానాలకు సంబంధించిన ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

టీఆర్ఎస్: 38 స్థానాల్లో లీడ్.. 33 చోట్ల విజయం
బీజేపీ: 19 స్థానాల్లో లీడ్.. 17 చోట్ల విజయం
కాంగ్రెస్: 1 స్థానంలో లీడ్... 2 చోట్ల విజయం
ఎంఐఎం: 8 స్థానాల్లో లీడ్.. 31 స్థానాల్లో విజయం

4:36 PM IST

హబ్సీగూడలో బీజేపీ విజయం

హబ్సీగూడలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి చేతన... ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సతీమణి బేతి స్వప్నపై విజయం సాధించారు. 

4:12 PM IST

19 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 19 చోట్ల విజయం సాధించగా... ప్రస్తుతం 40 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. 

4:10 PM IST

ఏడు స్థానాల్లో బీజేపీ విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు ఏడు చోట్ల విజయం సాధించింది. మొండా మార్కెట్, చైతన్యపురి, జీడిమెట్ల, మూసారంబాగ్, అడిక్‌మెట్, గచ్చిబౌలి, ముషీరాబాద్‌లో కాషాయ అభ్యర్ధులు గెలుపొందారు.

3:47 PM IST

36 చోట్ల బీజేపీ ఆధిక్యం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. ప్రస్తుతం కమలం 36 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. 
 
3:35 PM IST

మరో రెండు చోట్ల ఎంఐఎం విజయం

పాతబస్తీలో ఎంఐఎం సత్తా చాటుతోంది. శాస్త్రిపురంలో మహ్మద్ ముబీన్, సులేమాన్ నగర్‌లో అబీదా సుల్తానాలు విజయం సాధించారు. 

3:32 PM IST

మొత్తం నాలుగు చోట్ల బీజేపీ విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించింది. అవి గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, చైతన్యపురి, గౌలిపురా
 
3:30 PM IST

కుత్బుల్లాపూర్, భారతీనగర్‌లలో టీఆర్ఎస్ విజయం

కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్ధి కే. గౌరిష్ పారిజాత, భారతీనగర్‌లో గులాబీ పార్టీ అభ్యర్ధి వి. సింధులు విజయం సాధించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ 44 డివిజన్‌లలో ఆధిక్యంలో వున్నారు. 

3:20 PM IST

రెండు చోట్ల బీజేపీ విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా చైతన్యపురి, గౌలిపురా డివిజన్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. 

3:18 PM IST

రహమత్ నగర్ పోలింగ్ బూత్‌లో ఓట్ల లెక్కింపు నిలిపివేత

బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని రహమత్ నగర్‌లో పోలింగ్ బూత్ నెంబర్ 57లో ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తెరిచి వుండటంతో కౌంటింగ్ నిలిపివేశారు. అలాగే రహమత్ నగర్ బూత్ ఓట్లను సిబ్బంది పక్కనబెట్టారు.  

3:06 PM IST

పాతబస్తీలో పతంగి జోరు

ఎప్పటిలాగే పాతబస్తీలో ఎంఐఎం హవా చూపిస్తోంది. ఫలక్‌నూమా డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్ధి తారాబాయి, దత్తాత్రేయ నగర్‌లో మహ్మద్ జకీర్ బుఖారీ, కిషన్‌బాగ్‌లో ఖాజా ముబషీరుద్దీన్, తలాబ్ చంచలంలో సమీనా బేగం, జహనుమాలో మహ్మద్ అబ్ధుల్ ముక్తాదర్ విజయం సాధించారు. 

3:04 PM IST

బీజేపీ లీడ్‌లో వున్న స్థానాలు

వనస్థలిపురం
చంపాపేట
లింగోజీ గూడెం
మన్సూరాబాద్, 
హయత్ నగర్
ముషీరాబాద్
కొండాపూర్
గచ్చిబౌలి
జీడిమెట్ల
సీతాఫల్ మండి
బేగంబజార్
మోండా మార్కెట్
రాంగోపాల్ పేట్
సరూర్‌నగర్
కొత్తపేట
ఆర్కేపురం
వినాయక నగర్
చైతన్యపురి
గడ్డి అన్నారం
గాంధీ నగర్
అడిక్ మెట్
అమీర్ పేట్
తార్నాక

2:55 PM IST

నవాబ్‌సాహెబ్ కుంటలో ఎంఐఎం విజయం

నవాబ్‌సాహెబ్‌కుంటలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి షిరీన్ ఖాతూన్ గెలుపొందారు. 

2:48 PM IST

చింతల్, సనత్‌నగర్‌లలో టీఆర్ఎస్ విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ఖాతాలో మరో రెండు స్థానాలు వెళ్లాయి. సనత్‌నగర్‌లో కొలను లక్ష్మీ, చింతల్ రషీదాబేగం విజయం సాధించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం అల్వాల్, వెంకటాపురం, రామచంద్రాపురం, రంగారెడ్డి నగర్‌తో పాటు మొత్తం ఆరు స్థానాల్లో కారు దూసుకెళ్లింది. 
 
2:41 PM IST

రెండు గంటల నాటికి ఆధిక్యం వివరాలు

70 డివిజన్లలో టీఆర్ఎస్
45 డివిజన్లలో ఎంఐఎం
30 డివిజన్లలో ఎంఐఎం
4  డివిజన్లలో కాంగ్రెస్

2:31 PM IST

టీఆర్ఎస్ ఖాతాలో విజయాలు

ఆర్సీపురం, యూసుఫ్‌గూడ, మెట్టుగూడల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 

2:28 PM IST

బన్సీలాల్ పేటలో టీఆర్ఎస్ ఆధిక్యం

బన్సీలాల్ డివిజన్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి ఆ పార్టీ అభ్యర్ధి కుర్మ హేమలత 500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.     

2:00 PM IST

అక్కడ టీఆర్ఎస్-బిజెపి హోరాహోరీ

టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ డివిజన్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నా చాలాచోట్లు బిజెపి పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఖైరతాబాద్, సోమాజీగూడలో హోరాహోరీ ఫైట్ సాగుతోంది.

2:00 PM IST

పాతబస్తీలో ఎంఐఎం హవా...మరో మూడు చోట్ల విజయం

బార్కాస్, పత్తర్ ఘట్, చాంద్రాయణగుట్ట లో ఎంఐఎం విజయం సాధించింది.  

1:45 PM IST

టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం

ఆర్సీ పురంలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
 
1:45 PM IST

గచ్చిబౌలిలో బిజెపి ఆధిక్యం

గచ్చిబౌలిలో బిజెపి 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

1:45 PM IST

ఎంఐఎం ఆధిక్యం

బార్కస్, పత్తర్ గట్, చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం ఆధిక్యం కొనసాగుతోంది.

1:17 PM IST

మూడోది... అహ్మద్ నగర్ లో ఎంఐఎం విజయం

అహ్మద్ నగర్ డివిజన్ లో ఎంఐఎం మరో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ఖాతాలోకి మూడో విజయం చేరింది. ఎంఐఎం అభ్యర్థి రఫత్ సుల్తానా విజేతగా  నిలిచారు.

12:55 PM IST

ఖాతా తెరిచిన కాంగ్రెస్... ఏఎస్ రావు నగర్ లో విజయం

ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శిరీషరెడ్డి విజయం సాధించారు.
 
12:47 PM IST

డబీర్ పూర్ లో ఎంఐఎం విజయం

డబీర్ పురాలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి హుస్సేన్ ఖాన్ విజయం సాధించారు.

12:38 PM IST

టీఆర్ఎస్ ఖాతాలో రెండో డివిజన్... మెట్టుగూడలో విజయం

టీఆర్ఎస్ ఖాతాలో రెండో డివిజన్ చేరింది. మొట్టగూడలో ఆ పార్టీ అభ్యర్థి సునీత విజయం సాధించారు.

12:23 PM IST

తొలి విజయం... యూసుప్ గూడలో టీఆర్ఎస్ గెలుపు

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాల బోణీ కొట్టింది. యూసుప్ గూడ టీఆర్ఎస్ ఖాతాలోకి చేరింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించింది.
 
12:11 PM IST

ఒకే ఒక్కటి... ఏఎస్ రావ్ నగర్ లో కాంగ్రెస్ ఆధిక్యం

ఏఎస్ రావ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వుంది. ఇప్పటివరకు తొలి రౌండ్ ఫలితాల్లో కేవలం ఒకే ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
 
12:07 PM IST

మెహదీపట్నంలో ఎంఐఎం

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం బోణీ కొట్టింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సెన్ విజయం సాధించారు.
 
12:01 PM IST

టీఆర్ఎస్ ఆధిక్యంలో వున్న మరికొన్ని డివిజన్లు

బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం
చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 
కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం 
మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో టీఆర్ఎస్ ఆధిక్యం 
శేరిలింగంపల్లిల్లో టీఆర్ఎస్ అధిక్యం
గాజలరామారంలో టీఆర్ఎస్ అధిక్యం
రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ అధిక్యం

11:53 AM IST

మెహదీపట్నంలో ఎంఐఎం ముందంజ

మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ తొలి రౌండ్ లో ఆధిక్యాన్ని కనబర్చారు.

11:42 AM IST

హస్తినాపురం, చంపాపేట్ లో బిజెపి ఆధిక్యం

 హస్తినాపురం, చంపాపేట్ లో కూడా బిజెపి ఆధిక్యాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.  

11:42 AM IST

తొలిరౌండ్...బిజెపి ఆధిక్యంలో వున్న డివిజన్లు

వనస్థలిపురం, భారతీనగర్, చైతన్యపురి, గడ్డి అన్నారం, ఆర్కే పురం డివిజన్లలో బిజెపికి ఆధిక్యం లభించింది.

11:31 AM IST

ఫస్ట్ రౌండ్ ఫలితం: కాప్రా, మీర్ పేట్ లో బిజెపి ఆధిక్యం

కాప్రా, మీర్ పేట్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో వున్నట్లు తెలుస్తోంది. ఓల్డ్ బోయిన్ పల్లిలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో వున్నట్లు తెలుస్తోంది.

11:31 AM IST

పలు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం

చందా నగర్, హైదర్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, బాలా నగర్ డివిజన్లలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

11:28 AM IST

కూకట్ పల్లి కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత

కూకట్ పల్లి కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలయిన ఓట్లకంటే తక్కువ ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో వున్నాయని బిజెపి ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. 
 
11:15 AM IST

ఆర్సిపురం,పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యం

ఆర్సిపురం, పటాన్ చెరు డివిజన్లలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తోంది. 

11:00 AM IST

జాంబాగ్ డివిజన్ లో ఓట్లు గల్లంతు... బిజెపి అభ్యంతరం

జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో గందరగోళం నెలకొంది. పోలయిన ఓట్లు గల్లంతయ్యాయని బిజెపి ఎన్నికల అధికారులను నిలదీశారు. అయితే ఎన్నికల రోజు పోలింగ్ శాతం తప్పుగా చెప్పామంటున్నారు ఎన్నికల అధికారులు. 
 
10:21 AM IST

మొదలైన ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవడంతో అన్ని డివిజన్లలో మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో తొలి రౌండ్ ఫలితం తేలనుంది.

10:03 AM IST

పోస్టల్ బ్యాలెట్... చాంద్రాయణగుట్టలో టీఆర్ఎస్ కు1, ఎంఐఎంకు 1

చాంద్రాయణగుట్టలో టిఆర్ఎస్ కు 1పోస్టల్ బ్యాలెట్ ఓటు లభించింది. ఎంఐఎంకు 1 ఓటు లభించింది.

9:58 AM IST

అప్పటివరకు ర్యాలీలు నిషేధం: సిపి సజ్జనార్ హెచ్చరిక

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో  7 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. 48 గంటల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ జరగచ్చని అన్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో  ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

9:52 AM IST

ఎస్ఈసీకి సర్క్యులర్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

గ్రేటర్ ఎన్నికల్లో పోలయిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎస్ఈసీ జారీచేసిన సర్య్కులర్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయం తాజా నిర్ణయం తీసుకుంది.

9:35 AM IST

పోస్టల్ బ్యాలెట్... ఖైరతాబాద్ లో బిజెపికి 3, టీఆర్ఎస్ కు 1

ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ కు1, బిజెపికి 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి.

9:27 AM IST

పోస్టల్ బ్యాలెట్... గాంధీనగర్ లో బిజెపిదే పైచేయి

గాంధీ నగర్లో బీజేపీ 07పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఇక టీఆర్ఎస్ 2, నోటాకు 1 ఓటు పడింది.
 
9:20 AM IST

పోస్టల్ బ్యాలెట్... గడ్డి అన్నారంలో బిజెపికి స్పష్టమైన ఆధిక్యం

 గడ్డిఅన్నారం డివిజన్లో

టీఆర్ఎస్ - 02,

బీజేపీ - 10,

కాంగ్రెస్ - 00,

టీడీపీ - 01,
నోటా -రిజెక్ట్-     03ఓట్లు వచ్చాయి.

బిజెపి 8 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
 
9:20 AM IST

బేగంబజార్ లో బిజెపి ఆధిక్యం

బేగంబజార్ లో బిజెపికి 6 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ కు కేవలం 1 పోస్టల్ ఓటు లభించింది.
 
9:13 AM IST

బీఎన్ రెడ్డి నగర్ లో బిజెపి ఆధిక్యం

బీఎన్ రెడ్డి నగర్ లో బిజెపికి 4 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి. 

9:13 AM IST

పోస్టల్ బ్యాలెట్...రామంతాపూర్ లో బిజెపికి 8, టీఆర్ఎస్ కు 2

రామంతాపూర్ లో బిజెపికి 8, టీఆర్ఎస్ కు 2 బ్యాలెట్ ఓట్లు లభించాయి.

9:07 AM IST

పోస్టల్ బ్యాలెట్.. 10 ఓట్లతో బిజెపి ఆధిక్యం

ఉప్పల్ లో బిజెపికి 10, టీఆర్ఎస్ కు 4 పోస్టల్ ఓట్లు లభించాయి. 

9:07 AM IST

హఫీజ్ పేటలో బిజెపి ఆధిక్యం...4 పోస్టల్ ఓట్లు

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భాగంగా హఫీజ్ పేట్ లో బిజెపికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇక్కడ బిజెపికి 4ఓట్లు వచ్చాయి. 

9:05 AM IST

పోస్టల్ బ్యాలెట్... మన్సూరాబాద్ బిజెపిదే ఆధిక్యం

మన్సూరాబాద్ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో బిజెపికి 8, టీఆర్ఎస్ కు 6 ఓట్లు వచ్చాయి.

8:59 AM IST

పోస్టల్ బ్యాలెట్...బిజెపికి 13, టీఆర్ఎస్ 12 ఓట్లు

నాగోల్ లో బిజెపికి 13పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ కు 12 ఓట్లు వచ్చాయి.
 
8:59 AM IST

పోస్టల్ బ్యాలెట్...బిజెపిదే ఆధిక్యం

కవాడీగూడలో బిజెపికి 10 పోస్టల్ ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 2 ఓట్లు వచ్చాయి.

8:57 AM IST

పోస్టల్ బ్యాలెట్...పటాన్ చెరులో బిజెపికి 1, టీఆర్ఎస్ కు 1

 పటాన్ చెరులో బిజెపికి 1, టీఆర్ఎస్ కు 1ఓటు వచ్చింది.
 
8:52 AM IST

కొండాపూర్ లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బిజెపివే

కొండాపూర్ లో బిజెపి 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి.

8:49 AM IST

హయత్ నగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత

హయత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద బిజెపి, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.

8:46 AM IST

పోస్టల్ బ్యాలెట్...బిజెపి 3,టీఆర్ఎస్ 2

రంగారెడ్డినగర్ డివిజన్ లో బిజెపికి మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వస్తే టీఆర్ఎస్ కు రెండు ఓట్లు వచ్చాయి.
 
8:43 AM IST

పోస్టల్ బ్యాలెట...బిజెపి9, టీఆర్ఎస్ 3డివిజన్లలో ఆధిక్యం

గాజులరామారం, గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో బిజెపి ఆధిక్యంలో వుంది. అలాగే లింగోజీగూడలో కూడా బిజెపి ఆధిక్యం సాగుతోంది. హైదర్ నగర్ లో కూడా బిజెపి ఆధిక్యం సాగుతోంది.
 
8:37 AM IST

పోస్టల్ బ్యాలెట్... వనస్థలిపురంలో బిజెపి ఆధిక్యం

వనస్థలిపురంలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపికి 5ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 2 ఓట్లు వచ్చాయి.
 
8:37 AM IST

పోస్టల్ బ్యాలెట్...టీఆర్ఎస్, బిజెపి హోరాహోరీ

కూకట్ పల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 24 కు , బిజెపి 21  ,టిడిపికి 2 ఓట్లు వచ్చాయి.

8:34 AM IST

పోస్టల్ బ్యాలెట్.. శేరిలింగంపల్లిలో బిజెపి ఆధిక్యం

  శేరిలింగంపల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యం సాధించింది. అధికార టీఆర్ఎస్ కు3 ఓట్లు రాగా బిజెపికి 5 ఓట్లు వచ్చాయి.

8:31 AM IST

పోస్టల్ బ్యాలెట్: గచ్చిబౌలిలో బిజెపి 5, టీఆర్ఎస్ 3

గచ్చిబౌలిలో పోస్టల్ ఓట్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యం కనిపిస్తోంది.  బిజెపికి 5 ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 3 ఓట్లు వచ్చాయి.
 
8:28 AM IST

పోస్టల్ బ్యాలెట్... భాతినగర్ లో బిజెపి 3,టీఆర్ఎస్ 4

భారతినగర్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని సాధించింది.బిజెపికి 3ఓట్లు రాగా టీఆర్ఎస్ కు నాలుగు ఓట్లు  వచ్చాయి. నోటాకు 1ఓటు వచ్చింది.
 
8:24 AM IST

పోస్టల్ బ్యాలెట్...బోయిన్ పల్లిలో బిజెపి 7, టీఆర్ఎస్ 8

 బోయిన్ పల్లిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా టీఆర్ఎస్ కు 8, బిజెపికి 7 వచ్చాయి. 2 ఓట్లు చెల్లలేదు.
 
8:24 AM IST

హయత్ నగర్ లో పోస్టల్ బ్యాలెట్... బిజెపికి 3, టీఆర్ఎస్ కు 1

హయత్ నగర్ లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా బిజెపికి 3, టీఆర్ఎస్ కు 1 వచ్చినట్లు సమాచారం.
 
8:06 AM IST

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లోకి అన్ని పార్టీల ఏజెంట్లు చేరుకున్నారు. 
 
7:55 AM IST

గోషామహల్ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం

గోషామహల్ లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్దకు వందల సంఖ్యలో సిబ్బంది చేరుకున్నారు. ఆర్డర్ కాపీలు,పాస్ పుస్తకాలను పట్టుకుని కేంద్రంలోకి వెళ్లేందుకు అధికారులు తోసుకుంటున్నారు. వీరిని పోలీసులు కౌంటింగ్ కేంద్రంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
7:34 AM IST

ఓట్ల లెక్కింపుపై ఈసీ నిర్ణయం...హైకోర్టును ఆశ్రయించిన బిజెపి

గ్రేటర్ ఎన్నికల్లో పోలయిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎస్ఈసీ జారీచేసిన సర్య్కులర్ పై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది బిజెపి.
 
7:29 AM IST

గ్రేటర్ లో 1926 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు

జిహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదయ్యింది.74,67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34,50,331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇతరులు 72 మంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు. 1926 పోస్టల్ బ్యాలెట్ల జారీ చేశారు.

7:23 AM IST

కౌంటింగ్ కేంద్రంలోకి... నో మాస్క్ నో ఎంట్రీ

కరోనా నిబంధనలకు అనుసరించే జిహెచ్ఎంసి కౌంటింగ్ ప్రక్రియ సాగనుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుందని ఈసీ ఇప్పటికే ప్రకటించింది.

7:23 AM IST

బ్యాలెట్ కౌటింగ్ కు ముందే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు. ప్రతి టేబుల్ దగ్గర  సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. 

7:18 AM IST

ఓట్ల లెక్కింపుపై ఎస్ఈసి సంచలన నిర్ణయం

ఓట్ల లెక్కింపు విషయంలో అనుసరించాల్సిన నిబంధనలకు సంబంధించిఎస్ఈసీ ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఇందులో కేవలం స్వస్తిక్ గుర్తు వుంటేనే కాదు పెన్నుతో గీసిన, మరేవిధంగా అయినా ఏ పార్టీకి ఓటేశారో తెలిసేలా వుంటే ఆ ఓట్లను లెక్కించాలని సర్క్యూలర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

7:13 AM IST

మొదటి ఫలితం మెహదీపట్నందే

జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది. 8గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తొలి ఫలితం మెహదీపట్నంలో తేలనుంది. మధ్యాహ్నానికి తుది ఫలితం తేలనుంది. 

5:56 PM IST:

కూకట్‌పల్లి సర్కిల్‌ని టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. సర్కిల్‌ పరిధిలోని మొత్తం 6 డివిజన్లను కైవసం చేసుకుంది. ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, వివేకానంద నగర్, హైదర్‌నగర్, అల్విన్ కాలనీలను కారు సొంతం చేసుకుంది. 

5:30 PM IST:

చర్లపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి విజయం సాధించారు. 

5:25 PM IST:

వనస్థలిపురం డివిజన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్ధి రాగుల వెంకటేశ్వర్ రెడ్డి 702 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

5:19 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల తీర్పు స్పష్టత దిశగా వస్తోంది. 42 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం ఖరారైంది. 39 డివిజన్లలో ఎంఐఎం గెలుపొందింది. 25 డివిజన్లలో బీజేపీ అభ్యర్ధులు గెలుపొందారు. 2 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.  

4:44 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 90 స్థానాలకు సంబంధించిన ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

టీఆర్ఎస్: 38 స్థానాల్లో లీడ్.. 33 చోట్ల విజయం
బీజేపీ: 19 స్థానాల్లో లీడ్.. 17 చోట్ల విజయం
కాంగ్రెస్: 1 స్థానంలో లీడ్... 2 చోట్ల విజయం
ఎంఐఎం: 8 స్థానాల్లో లీడ్.. 31 స్థానాల్లో విజయం

4:37 PM IST:

హబ్సీగూడలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి చేతన... ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సతీమణి బేతి స్వప్నపై విజయం సాధించారు. 

4:13 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 19 చోట్ల విజయం సాధించగా... ప్రస్తుతం 40 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. 

4:10 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు ఏడు చోట్ల విజయం సాధించింది. మొండా మార్కెట్, చైతన్యపురి, జీడిమెట్ల, మూసారంబాగ్, అడిక్‌మెట్, గచ్చిబౌలి, ముషీరాబాద్‌లో కాషాయ అభ్యర్ధులు గెలుపొందారు.

3:47 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. ప్రస్తుతం కమలం 36 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. 
 
3:35 PM IST:

పాతబస్తీలో ఎంఐఎం సత్తా చాటుతోంది. శాస్త్రిపురంలో మహ్మద్ ముబీన్, సులేమాన్ నగర్‌లో అబీదా సుల్తానాలు విజయం సాధించారు. 

3:32 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించింది. అవి గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, చైతన్యపురి, గౌలిపురా
 
3:30 PM IST:

కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్ధి కే. గౌరిష్ పారిజాత, భారతీనగర్‌లో గులాబీ పార్టీ అభ్యర్ధి వి. సింధులు విజయం సాధించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ 44 డివిజన్‌లలో ఆధిక్యంలో వున్నారు. 

3:20 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా చైతన్యపురి, గౌలిపురా డివిజన్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. 

3:18 PM IST:

బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని రహమత్ నగర్‌లో పోలింగ్ బూత్ నెంబర్ 57లో ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తెరిచి వుండటంతో కౌంటింగ్ నిలిపివేశారు. అలాగే రహమత్ నగర్ బూత్ ఓట్లను సిబ్బంది పక్కనబెట్టారు.  

3:07 PM IST:

ఎప్పటిలాగే పాతబస్తీలో ఎంఐఎం హవా చూపిస్తోంది. ఫలక్‌నూమా డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్ధి తారాబాయి, దత్తాత్రేయ నగర్‌లో మహ్మద్ జకీర్ బుఖారీ, కిషన్‌బాగ్‌లో ఖాజా ముబషీరుద్దీన్, తలాబ్ చంచలంలో సమీనా బేగం, జహనుమాలో మహ్మద్ అబ్ధుల్ ముక్తాదర్ విజయం సాధించారు. 

3:04 PM IST:

వనస్థలిపురం
చంపాపేట
లింగోజీ గూడెం
మన్సూరాబాద్, 
హయత్ నగర్
ముషీరాబాద్
కొండాపూర్
గచ్చిబౌలి
జీడిమెట్ల
సీతాఫల్ మండి
బేగంబజార్
మోండా మార్కెట్
రాంగోపాల్ పేట్
సరూర్‌నగర్
కొత్తపేట
ఆర్కేపురం
వినాయక నగర్
చైతన్యపురి
గడ్డి అన్నారం
గాంధీ నగర్
అడిక్ మెట్
అమీర్ పేట్
తార్నాక

2:55 PM IST:

నవాబ్‌సాహెబ్‌కుంటలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి షిరీన్ ఖాతూన్ గెలుపొందారు. 

2:48 PM IST:

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ఖాతాలో మరో రెండు స్థానాలు వెళ్లాయి. సనత్‌నగర్‌లో కొలను లక్ష్మీ, చింతల్ రషీదాబేగం విజయం సాధించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం అల్వాల్, వెంకటాపురం, రామచంద్రాపురం, రంగారెడ్డి నగర్‌తో పాటు మొత్తం ఆరు స్థానాల్లో కారు దూసుకెళ్లింది. 
 
2:41 PM IST:

70 డివిజన్లలో టీఆర్ఎస్
45 డివిజన్లలో ఎంఐఎం
30 డివిజన్లలో ఎంఐఎం
4  డివిజన్లలో కాంగ్రెస్

2:31 PM IST:

ఆర్సీపురం, యూసుఫ్‌గూడ, మెట్టుగూడల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 

2:28 PM IST:

బన్సీలాల్ డివిజన్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి ఆ పార్టీ అభ్యర్ధి కుర్మ హేమలత 500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.     

2:03 PM IST:

టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ డివిజన్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నా చాలాచోట్లు బిజెపి పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఖైరతాబాద్, సోమాజీగూడలో హోరాహోరీ ఫైట్ సాగుతోంది.

2:01 PM IST:

బార్కాస్, పత్తర్ ఘట్, చాంద్రాయణగుట్ట లో ఎంఐఎం విజయం సాధించింది.  

1:51 PM IST:

ఆర్సీ పురంలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
 
1:46 PM IST:

గచ్చిబౌలిలో బిజెపి 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

1:45 PM IST:

బార్కస్, పత్తర్ గట్, చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం ఆధిక్యం కొనసాగుతోంది.

1:21 PM IST:

అహ్మద్ నగర్ డివిజన్ లో ఎంఐఎం మరో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ఖాతాలోకి మూడో విజయం చేరింది. ఎంఐఎం అభ్యర్థి రఫత్ సుల్తానా విజేతగా  నిలిచారు.

12:56 PM IST:

ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శిరీషరెడ్డి విజయం సాధించారు.
 
12:48 PM IST:

డబీర్ పురాలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి హుస్సేన్ ఖాన్ విజయం సాధించారు.

12:38 PM IST:

టీఆర్ఎస్ ఖాతాలో రెండో డివిజన్ చేరింది. మొట్టగూడలో ఆ పార్టీ అభ్యర్థి సునీత విజయం సాధించారు.

12:24 PM IST:

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాల బోణీ కొట్టింది. యూసుప్ గూడ టీఆర్ఎస్ ఖాతాలోకి చేరింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించింది.
 
12:12 PM IST:

ఏఎస్ రావ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వుంది. ఇప్పటివరకు తొలి రౌండ్ ఫలితాల్లో కేవలం ఒకే ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
 
12:08 PM IST:

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం బోణీ కొట్టింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సెన్ విజయం సాధించారు.
 
12:02 PM IST:

బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం
చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 
కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం 
మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో టీఆర్ఎస్ ఆధిక్యం 
శేరిలింగంపల్లిల్లో టీఆర్ఎస్ అధిక్యం
గాజలరామారంలో టీఆర్ఎస్ అధిక్యం
రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ అధిక్యం

11:53 AM IST:

మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ తొలి రౌండ్ లో ఆధిక్యాన్ని కనబర్చారు.

11:44 AM IST:

 హస్తినాపురం, చంపాపేట్ లో కూడా బిజెపి ఆధిక్యాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.  

11:42 AM IST:

వనస్థలిపురం, భారతీనగర్, చైతన్యపురి, గడ్డి అన్నారం, ఆర్కే పురం డివిజన్లలో బిజెపికి ఆధిక్యం లభించింది.

11:36 AM IST:

కాప్రా, మీర్ పేట్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో వున్నట్లు తెలుస్తోంది. ఓల్డ్ బోయిన్ పల్లిలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో వున్నట్లు తెలుస్తోంది.

11:32 AM IST:

చందా నగర్, హైదర్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, బాలా నగర్ డివిజన్లలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

11:29 AM IST:

కూకట్ పల్లి కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలయిన ఓట్లకంటే తక్కువ ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో వున్నాయని బిజెపి ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. 
 
11:15 AM IST:

ఆర్సిపురం, పటాన్ చెరు డివిజన్లలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తోంది. 

11:00 AM IST:

జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో గందరగోళం నెలకొంది. పోలయిన ఓట్లు గల్లంతయ్యాయని బిజెపి ఎన్నికల అధికారులను నిలదీశారు. అయితే ఎన్నికల రోజు పోలింగ్ శాతం తప్పుగా చెప్పామంటున్నారు ఎన్నికల అధికారులు. 
 
10:21 AM IST:

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవడంతో అన్ని డివిజన్లలో మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో తొలి రౌండ్ ఫలితం తేలనుంది.

10:03 AM IST:

చాంద్రాయణగుట్టలో టిఆర్ఎస్ కు 1పోస్టల్ బ్యాలెట్ ఓటు లభించింది. ఎంఐఎంకు 1 ఓటు లభించింది.

9:58 AM IST:

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో  7 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. 48 గంటల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ జరగచ్చని అన్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో  ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

9:52 AM IST:

గ్రేటర్ ఎన్నికల్లో పోలయిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎస్ఈసీ జారీచేసిన సర్య్కులర్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయం తాజా నిర్ణయం తీసుకుంది.

9:35 AM IST:

ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ కు1, బిజెపికి 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి.

9:28 AM IST:

గాంధీ నగర్లో బీజేపీ 07పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఇక టీఆర్ఎస్ 2, నోటాకు 1 ఓటు పడింది.
 
9:25 AM IST:

 గడ్డిఅన్నారం డివిజన్లో

టీఆర్ఎస్ - 02,

బీజేపీ - 10,

కాంగ్రెస్ - 00,

టీడీపీ - 01,
నోటా -రిజెక్ట్-     03ఓట్లు వచ్చాయి.

బిజెపి 8 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
 
9:20 AM IST:

బేగంబజార్ లో బిజెపికి 6 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ కు కేవలం 1 పోస్టల్ ఓటు లభించింది.
 
9:15 AM IST:

బీఎన్ రెడ్డి నగర్ లో బిజెపికి 4 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి. 

9:13 AM IST:

రామంతాపూర్ లో బిజెపికి 8, టీఆర్ఎస్ కు 2 బ్యాలెట్ ఓట్లు లభించాయి.

9:09 AM IST:

ఉప్పల్ లో బిజెపికి 10, టీఆర్ఎస్ కు 4 పోస్టల్ ఓట్లు లభించాయి. 

9:08 AM IST:

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భాగంగా హఫీజ్ పేట్ లో బిజెపికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇక్కడ బిజెపికి 4ఓట్లు వచ్చాయి. 

9:06 AM IST:

మన్సూరాబాద్ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో బిజెపికి 8, టీఆర్ఎస్ కు 6 ఓట్లు వచ్చాయి.

9:02 AM IST:

నాగోల్ లో బిజెపికి 13పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ కు 12 ఓట్లు వచ్చాయి.
 
8:59 AM IST:

కవాడీగూడలో బిజెపికి 10 పోస్టల్ ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 2 ఓట్లు వచ్చాయి.

8:58 AM IST:

 పటాన్ చెరులో బిజెపికి 1, టీఆర్ఎస్ కు 1ఓటు వచ్చింది.
 
8:52 AM IST:

కొండాపూర్ లో బిజెపి 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి.

8:50 AM IST:

హయత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద బిజెపి, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.

8:47 AM IST:

రంగారెడ్డినగర్ డివిజన్ లో బిజెపికి మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వస్తే టీఆర్ఎస్ కు రెండు ఓట్లు వచ్చాయి.
 
8:44 AM IST:

గాజులరామారం, గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో బిజెపి ఆధిక్యంలో వుంది. అలాగే లింగోజీగూడలో కూడా బిజెపి ఆధిక్యం సాగుతోంది. హైదర్ నగర్ లో కూడా బిజెపి ఆధిక్యం సాగుతోంది.
 
8:40 AM IST:

వనస్థలిపురంలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపికి 5ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 2 ఓట్లు వచ్చాయి.
 
8:37 AM IST:

కూకట్ పల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 24 కు , బిజెపి 21  ,టిడిపికి 2 ఓట్లు వచ్చాయి.

8:34 AM IST:

  శేరిలింగంపల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యం సాధించింది. అధికార టీఆర్ఎస్ కు3 ఓట్లు రాగా బిజెపికి 5 ఓట్లు వచ్చాయి.

8:32 AM IST:

గచ్చిబౌలిలో పోస్టల్ ఓట్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యం కనిపిస్తోంది.  బిజెపికి 5 ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 3 ఓట్లు వచ్చాయి.
 
8:29 AM IST:

భారతినగర్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని సాధించింది.బిజెపికి 3ఓట్లు రాగా టీఆర్ఎస్ కు నాలుగు ఓట్లు  వచ్చాయి. నోటాకు 1ఓటు వచ్చింది.
 
8:26 AM IST:

 బోయిన్ పల్లిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా టీఆర్ఎస్ కు 8, బిజెపికి 7 వచ్చాయి. 2 ఓట్లు చెల్లలేదు.
 
8:24 AM IST:

హయత్ నగర్ లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా బిజెపికి 3, టీఆర్ఎస్ కు 1 వచ్చినట్లు సమాచారం.
 
8:06 AM IST:

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లోకి అన్ని పార్టీల ఏజెంట్లు చేరుకున్నారు. 
 
7:55 AM IST:

గోషామహల్ లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్దకు వందల సంఖ్యలో సిబ్బంది చేరుకున్నారు. ఆర్డర్ కాపీలు,పాస్ పుస్తకాలను పట్టుకుని కేంద్రంలోకి వెళ్లేందుకు అధికారులు తోసుకుంటున్నారు. వీరిని పోలీసులు కౌంటింగ్ కేంద్రంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
7:35 AM IST:

గ్రేటర్ ఎన్నికల్లో పోలయిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎస్ఈసీ జారీచేసిన సర్య్కులర్ పై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది బిజెపి.
 
7:29 AM IST:

జిహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదయ్యింది.74,67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34,50,331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇతరులు 72 మంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు. 1926 పోస్టల్ బ్యాలెట్ల జారీ చేశారు.

7:26 AM IST:

కరోనా నిబంధనలకు అనుసరించే జిహెచ్ఎంసి కౌంటింగ్ ప్రక్రియ సాగనుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుందని ఈసీ ఇప్పటికే ప్రకటించింది.

7:23 AM IST:

బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు. ప్రతి టేబుల్ దగ్గర  సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. 

7:19 AM IST:

ఓట్ల లెక్కింపు విషయంలో అనుసరించాల్సిన నిబంధనలకు సంబంధించిఎస్ఈసీ ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఇందులో కేవలం స్వస్తిక్ గుర్తు వుంటేనే కాదు పెన్నుతో గీసిన, మరేవిధంగా అయినా ఏ పార్టీకి ఓటేశారో తెలిసేలా వుంటే ఆ ఓట్లను లెక్కించాలని సర్క్యూలర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

7:14 AM IST: