హైదరాబాద్: హైదరాబాదు పాతబస్తీలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసును కామాటిపురా పోలీసు స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) మహిళా పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాదు పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

దర్యాప్తు బృందానికి మహిళా అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. 16 ఏళ్ల బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆదివారంనాడు ఆందోళనకు దిగడంతో ఈ కేసులో పోలీసులు ముందుకు కదిలారు. 

16 ఏళ్ల అమ్మాయిపై ఏళ్ల తరబడిగా 11 మంది అత్యాచారం చేసిన ఘటనలో ఓ నిందితుడిని సాక్షిగా చేర్చడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసును సిసిఎస్ మహిళా పోలీసు స్టేషన్ ఎసిపి కె. శ్రీదేవికి అప్పగిస్తూ హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కేసును సోమవారంనాడు సిసిఎస్ కు బదిలీ చేశారని, వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మరింత మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారని కామాటిపురా పోలీసులు చెప్పారు.  

సంబంధిత వార్తలు

మైనర్‌పై 11 మంది గ్యాంగ్‌రేప్: హోం మంత్రి సీరియస్

రెండేళ్లుగా అమ్మాయిపై 11 మంది రేప్: నిందితులు వీరే..

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: వీడియోలు తీసి 4 ఏళ్లుగా అత్యాచారం (వీడియో)