Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో కరోనా వైరస్ ఆందోళన: నలుగురిపై అనుమానం

హైదరాబాదులో కరోనా వైరస్ కలకలం రేగింది. హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో చేరిన నలుగురికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానించారు. అయితే, అందులో ముగ్గురికి అటువంటి సమస్య లేదని నిర్దారించారు.

Four people suspected coronavirus symptoms in Hyderabad
Author
Hyderabad, First Published Jan 27, 2020, 11:16 AM IST

హైదరాబాద్: హైదరాబాదులో కరోనా వైరస్ లక్షణాలు హైదరాబాదులోనూ కనిపించడంతో తీవ్ర కలకలం రేగుతోంది. అయితే, ఇప్పటి వరకు కరోనా వైరస్ లక్షణాలను నిర్ధారించలేదు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నలుగురు ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లు మాత్రమే అనుమానిస్తున్నారు. 

Also Read: కరోనా వైరస్ అంటే ఏమిటి.... ? ప్రపంచం ఎందుకు వణికిపోతుందంటే...

చైనాను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనా నుంచి హైదరాబాదు వచ్ిచన ఓ వైద్యుడు జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్ ఆస్పత్రిలో చేరాడు. అతడి రక్తనమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షించింది. అయితే కరోనా వైరస్ లేదని పరీక్షల్లో తేలింది.

See Video: రోనా వైరస్ : ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న చైనీస్ వైరస్

చైనా, హాంగ్ కాంగ్ ల నుంచి వచ్చినవారిలో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి .భయంతో వారు ముందుగానే వైద్యులను సంప్రదిస్తున్నారు. కాగా, జ్వరంతో నలుగురు ఆదివారంనాడు హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. వీరిలో ముగ్గురు చైనా, హాంగ్ కాంగ్ లనుంచి వచ్చినవారు. మరొకరు వారిలో ఒకరి భార్య. ఈ నలుగురిని ప్రత్యేక గదుల్లో పెట్టి వైద్యులు పరీక్షిస్తున్నారు. 

వారిలో ఒక వ్యక్తి మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నాయి. దీంతో అతని రక్తనమూనాలను సేకరించి పూణేకు పంపించారు. సోమవారం ఆ ఫలితాలు రావచ్చు. మిగిలిన ముగ్గురికి ముక్కు కారడం తప్ప వారిలో ఇతర లక్షణాలు ఏవీ లేవు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారి కోసం ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఎనిమిది పడకల ఐసియూను ఏర్పాటు చేశారు. 

Also Read: కేరళ నర్స్ కి కరోనా వైరస్.... సౌదీకి కూడా పాకేసింది

Follow Us:
Download App:
  • android
  • ios