మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం: పట్టుబడిన యువతులు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 9, Sep 2018, 8:42 AM IST
Five arrested resorting for prostitution
Highlights

సెలూన్‌-స్పా పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వైనం వెలుగు చూసింది. ఆ మసాజ్ సెంటర్ పై సికింద్రాబాదులోని  మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: సెలూన్‌-స్పా పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వైనం వెలుగు చూసింది. ఆ మసాజ్ సెంటర్ పై సికింద్రాబాదులోని  మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 

నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఏఎస్‌రావునగర్‌ సాయినాథపురానికి చెందిన ముంగడ హరీష్‌(24) అదే ప్రాంతంలో స్డుడియో-11 పేరుతో సెలూన్‌-స్పా నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి రహస్యంగా పురుషులకు మసాజ్‌ చేయిస్తున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. 

నిర్వాహకుడు హరీష్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. 
 
ఇదిలావుంటే, మెట్టుగూడలో మసాజ్‌ సెంటర్‌పై శనివారం సాయంత్రం చిలకలగూడ పోలీసులు దాడి చేశారు. బెంగళూర్‌కు చెందిన సమీర్‌ అగర్వాల్‌(40) మెట్టుగూడ గాయత్రి ప్లాజా ప్లాట్‌ నెంబర్‌ 302లో స్టార్‌ స్పా సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. 

తమకు అందిన సమాచారంతో చిలకలగూడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి నేతృత్వంలో డీఐ నర్సింహరాజు, ఇద్దరు మహిళ పోలీసులు, సిబ్బందితో కలిసి స్టార్‌ స్పా సెంటర్‌పై దాడి చేశారు. నిర్వాహకుడు సమీర్‌తో పాటు స్పా సెంటర్‌లో పనిచేసే పశ్చిమబెంగాల్‌కు చెందిన షకీర్‌ అలీ(35), సుమిత్‌ సర్కార్‌(28)లను అరెస్టు చేశారు. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్‌బోస్(40), హైదరాబాదు నగరానికి చెందిన శశాంక్‌(25), శ్రీకాంత్‌(27), పశ్చిమబెంగాల్‌కు చెందిన మౌంటెసింగ్‌(24), లియాదాస్(25) అనే కస్టమర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వారి వద్ద నుంచి 20,130రూపాయల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, కండోమ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

loader