Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు భార్యలు, అతను వ్యభిచారం గృహం: అమ్మాయిని ఎర వేసి.....

అమ్మాయిని ఎర వేసి రమేష్ ను తన గదికి రప్పించి అతనికి మత్తుబిల్లలు కలిపిన మద్యం తాగించి రాజూ నాయక్ అతన్ని హత్య చేసినట్లు వెల్లడైంది. రమేష్ దారుణమైన హత్య హైదరాబాదులో జరిగింది.

Fish vendor murder: Accused Raju Naik Pecca plan
Author
Hyderabad, First Published Feb 6, 2020, 7:30 AM IST

హైదరాబాద్: చేపల వ్యాపారి రమేష్ (50)ను పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో చేపల వ్యాపారి రమేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితుడు రాజూ నాయక్ అలియాస్ శ్రీనివాస్ కు ఇద్దరు భార్యలు. వారితో అతను వ్యభిచార గృహాన్ని నడిపిస్తుంటాడు. అతను రమేష్ కు అమ్మాయిని ఎర వేసి రప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

అమ్మాయిని ఎర వేసి రమేష్ ను తాను అనుకున్న చోటుకు నిందితుడు రప్పించాడు. మద్యంలో మత్తు బిల్లలు కలిపి ఇచ్చాడు. దాంతో రమేష్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత సుత్తితో బలంగా మోది హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోస్తూ రమేష్ కుటుంబ సభ్యులు బేరసారాలు ఆడాడు. రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజూనాయక్ అలియాస్ శ్రీనివాస్ ను, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: కాళ్లు టేపుతో కట్టేసి గొంతు నులిమి రమేష్ హత్య: ఇద్దరి అరెస్టు

రమేష్ కు చెందిన ఇంట్లో రాజూ నాయక్ కొంత కాలం అద్దెకు ఉన్నాడు. అతనికి నజీమా, శారదాబాయి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. రాజూ నాయక్ అమ్మాయిలతో వ్యభిచార గృహం నిర్వహించేవాడు. రమేష్ ఇంట్లో ఉన్నప్పుడు అతనితో పరిచయం పెంచుకున్నాడు. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కూడా పరిచయాన్ని కొనసాగించాడు. 

ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో డబ్బున్న రమేష్ పై అతని కన్ను పడింది. అతన్ని కిడ్నాప్ చేసి డబ్బు రాబట్టాలని చూశాడు. అందుకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా భార్య నజీమాతో కలిసి నెల క్రితం శ్రీనివాస్ పేరు మీద జవహర్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

Also Read: మహిళ ఫోన్ తో బయటికి వచ్చిన చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య

రాజూ నాయక్ తన వద్ద ఓ అమ్మాయి ఉందంటూ జనవరి 21వ తేదీన రమేష్ కు ఫోన్ చేసి చెప్పి ఓ ఫొటో కూడా పంపించాడు. తన గదికి రావాలని పిలిచాడు. రమేష్ గదికి వచ్చి అమ్మాయి కనిపించక వెళ్లిపోయాడు. దాంతో రాజు నాయక్ ఈ నెల 1వ తేదీన మరో అమ్మాయి ఫొటో వాట్సప్ చేశాడు. 

అతడి మాటలు నమ్మి రమేష్ గదికి వెళ్లాడు. మద్యంలో మత్తు బిల్లలు కలిపి తాగించాడు. రమేష్ స్పృహ కోల్పోయిన తర్వాత అతని ఒంటి మీద ఉన్న ఐదు తులాల బంగారు గొలుసు, రెండు తులాల ఉంగరాలను తీసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని సుత్తితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ లు తీసుకుని తాళం వేసి గది నుంచి వెళ్లిపోయాడు. అదే రోజు నగలు అమ్మేసి డబ్బులు చేసుకున్నాడు. 

ఫిబ్రవరి 2వ తేదీన గదికి వచ్చి చూసేసరికి రమేష్ మరణించి కనిపించాడు. రమేష్ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూశాడు. 90 లక్షలు డిమాండ్ చేస్తూ రమేష్ ఫోన్ ద్వారా అతని భార్యకు రాజూ నాయక్ వాట్సప్ మెసేజ్ పంపించాడు. రమేష్ మృతదేహాన్ని గది నుంచి తీసుకుని వెళ్లి పారేయాలని చూశాడు. కానీ బరువు వల్ల అది సాధ్యం కాలేదు.

దాంతో కొడవలి తెచ్చి రమేష్ చేతులు, తొడ భాగం కోసి కవర్లో వేశాడు. మిగతా భాగాలు కోయడం సాధ్యం కాక ఆపేశాడు. అప్పటికే దుర్వాసన రావడంతో బయటకు వచ్చేశాడు. అదే దుర్వాసన రమేష్ హత్య సమాచారాన్ని పోలీసులకు అందించింది. 

టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి రాజూ నాయక్, అతని భార్యలను అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ను హత్య చేసినట్లు రాజూ నాయక్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios