కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. రక్షించాల్సిన తండ్రే లైంగిక దాడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాలిక తల్లడిల్లిపోయింది. నిందితుడిని రెయిన్‌బజార్‌ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. రెయిన్‌బజార్‌ పోలీస్స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి(38) పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. 

అతడి కళ్లు కన్న కూతురిపై పడ్డాయి. భార్య బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తె(17)పై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి మూడు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి ఆమెను ప్రశ్నించగా.. విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు.