లైంగిక పూజ పేరుతో బాలింతపై రేప్: లంకె బిందెలున్నాయని టెండర్

Fake Baba sexually assaults woman
Highlights

ఇంట్లో లంకె బిందెలున్నాయని, అందుకు క్షుద్రపూజలు చేయాలని నమ్మించి ఓ దుర్మార్గుడు బాలింతపై అత్యాచారం చేశాడు.

ఖమ్మం: ఇంట్లో లంకె బిందెలున్నాయని, అందుకు క్షుద్రపూజలు చేయాలని నమ్మించి ఓ దుర్మార్గుడు బాలింతపై అత్యాచారం చేశాడు.  తన కోరిక తీర్చడం పూజలో భాగమని అతను నమ్మించాడు. తన కోరిక తీర్చకపోతే నీ భర్త చనిపోతాడని బెదిరించాడు.

ఇంట్లో లంకె బిందెలున్నాయని, వాటిని తీయాలంటే పూజలు చేయాలని, అందుకు ఖర్చవుతుందని చెప్పాడు. అందుకు ఆ నకిలీ పూజారి లక్ష్మినారాయణ కుటుంబ సభ్యుల నుంచి రూ.40 వేలు ముందస్తుగా తీసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ పూజలు చేసే క్రమంలోనే ఇంట్లోని బాలింతపై అతను కన్నేశాడు. తాను ఇంటి వెనక పూజలు చేస్తానని చెప్పి, కుటుంబ సభ్యులంతా ఇంటి ముందే ఉండాలని కూడా చెప్పాడు. బాలింతను మాత్రం తన వెంట ఇంటి గూడారంలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.

అంతకు ముందు రకరకాల పూజలు కూడా చేశారు. లైంగిక పూజ కూడా అందులో భాగమని వారికి చెప్పాడు. మొదటి సారి కోరిక తీర్చుకున్న అతగాడు రెండోసారి అదే చేయడానికి సిద్ధపడ్డాడు. రెండోసారి కూడా అతను ఆమెను గుడారంలోకి తీసుకుని వెళ్లాడు. 

అయితే, ఆమెకు అనుమానం వచ్చి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. దాంతో ఇరుగుపొరుగు వారు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

loader