Asianet News TeluguAsianet News Telugu

రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈడీ నోటీసులు: తెరమీదికి మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు

టాలీవుడ్ డ్రగ్స్  కేసు  మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రముఖ హీరోయిన్  రకుల్ ప్రీత్ సింగ్ కు  ఈడీ అధికారులు  ఇవాళ నోటీసులు జారీ చేశారు.

Enforcement Directorate  To Start Probe  on  Tollywood Drugs Case
Author
First Published Dec 16, 2022, 3:23 PM IST

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేయడంతో  టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది.డ్రగ్స్ కేసులో  సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్  కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.  డ్రగ్స్ కేసులో  రకుల్ ప్రీత్ సింగ్  ను విచారణకు రావాలని ఆదేశించారు గత ఏడాది సెప్టెంబర్ మాసంలో  రకుల్ ప్రీత్ సింగ్  ను  ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

గత ఏడాది ఆగస్టు  31వ తేదీ నుండి సెప్టెంబర్  22 వ తేదీ వరకు  ఈడీ అధికారులు పలువురు టాలీవుడ్ ప్రముఖులను  ఈడీ అధికారులు ప్రశ్నించారు.2017 జూలైలో  ఎన్డీపీఎస్ చట్టం  కింద  ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు.  ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో  సిట్ ను ఏర్పాటు చేసింది.  అప్పట్లో  సిట్  అధికారులు ప్రముఖ టాలీవుడ్ నటులను విచారించింది. ఈ కేసులో మనీలాండరింగ్  జరిగిందని అధికారులు అనుమానించారు. దీంతో ఈ కేసులో ఈడీ రంగ ప్రవేశం చేసింది.  2021 సెప్టెంబర్ మాసంలో  మనీలాండరింగ్  కింద టాలీవుడ్ డ్రగ్స్ కేసు కింద  దర్యాప్తును ప్రారంభించింది. ఈ  విషయమై  టాలీవుడ్ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించారు. ప్రముఖ దర్శకుడు  పూరీ జగన్నాథ్, నటీ నటులు చార్మి. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్,  దగ్గుబాటి రానా,  ముమైత్ ఖాన్ , నందు, తనీష్ , నవనీత్ లను విచారించారు. రవితేజ  డ్రైవర్  శ్రీనివాస్ ఓ పబ్ మేనేజర్ ను కూడా  ఈడీ అధికారులు విచారించారు.

తాజాగా  మరోసారి  ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేయడంతో  ఈ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్  కేసు విషయమై సిట్ విచారణపై  విపక్షాలు విమర్శలు చేశాయి.  ఈ కేసులో సిట్ విచారణకు సంబంధించిన ఆధారాలను  ఇవ్వాలని ఈడీ అధికారులు తెలంగాణ హైకోర్టును  ఆశ్రయించారు. ఈ ఆధారాలను అందించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖను  హైకోర్టు ఆదేశించింది.  హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా  కూడా  తమకు ఆధారాలు ఇవ్వడం లేదని  ఈడీ అధికారులు  కోర్టును  ఈ ఏడాది మార్చి లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  2017లో  పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios