దుబ్బాక బైపోల్: ముగిసిన పోలింగ్, 81 శాతం ఓటింగ్ నమోదు

dubbaka bypoll live updates

దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. నియోజకవర్గంలో మొత్తం 315 బూతులను ఏర్పాటు చేయగా 89 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 
 
6:19 PM IST

పోస్టల్ బ్యాలెట్ లో 1068 మంది ఓటు హక్కు వినియోగం

పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1068 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యాయని ఈసీ ప్రకటించింది.

6:10 PM IST

2018లో 86 శాతం ఓటింగ్ నమోదు

2018 ఎన్నికల్లో 86 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
 
6:04 PM IST

ముగిసిన పోలింగ్..81 శాతం ఓటింగ్ నమోదు

దుబ్బాక స్థానంలో సాయంత్రం ఐదు గంటలకు 81.44 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలవరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించింది ఈసీ

5:05 PM IST

75 శాతం పోలింగ్ నమోదు

దుబ్బాకలో పోలింగ్ ముగియడానికి ఇంకా గంట సమయం మాత్రమే సమయం ఉంది. చివరి గంటలో కోవిడ్ బాధితులు ఓటింగ్ కు అవకాశం కల్పించనుంది 

4:02 PM IST

3 గంటలకు 71 శాతం పోలింగ్ నమోదు

దుబ్బాకలో మూడు గంటలకు 71. 10 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లు గుంపులుగా పోలింగ్ కేంద్రాలు చేరుకొంటున్నారు. పోలీసులు జనాన్ని తరిమికొడుతున్నారు

1:33 PM IST

మద్యాహ్నం ఒంటిగంట వరకు 55శాతం పోలింగ్

దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా కదులుతున్నారు. దీంతో ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివవరకు 55.52శాతం పోలింగ్ నమోదయ్యింది. 

11:38 AM IST

ఉదయం 11గంటల వరకు 34శాతం పోలింగ్

దుబ్బాక ఉప ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 34.33 శాతం పోలింగ్ న‌మోదయ్యింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 

10:10 AM IST

మొరాయించిన ఈవీఎం... ఆగిన పోలింగ్

దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అరగంట నుండి పోలింగ్ నిలిచిపోయింది.

9:10 AM IST

ఉదయం 9గంటల వరకు 16 శాతం ఓటింగ్

దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు అంటే ఉదయం 9 గంటలవరకు 16 శాతం ఓటింగ్ పూర్తయినట్లు సమాచారం. 

9:10 AM IST

ఓటు హక్కును వినియోగించుకున్న చెరుకు ముత్యంరెడ్డి

దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన తుక్కాపూర్ లో ఆయన ఓటేశారు. 
 
9:05 AM IST

ఓటేసిన బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు

దుబ్బాకలో ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుబ్బాక మండలంలోని తన స్వగ్రామం బొప్పాపూర్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు.   

7:54 AM IST

ఓటేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత

స్వగ్రామం చిట్టాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసివచ్చి ఓటేసిన ఆమె పోలింగ్ సరళిని పరిశీలించారు.   

7:23 AM IST

ఫోటీ ఆ పార్టీల మద్యే

​దుబ్బాక ఉపపోరులో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,90,483 మంది ఓటర్లు ఉండగా 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్‌ నమోదైంది.ఈసారి 1,98,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
6:19 PM IST:

పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1068 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యాయని ఈసీ ప్రకటించింది.

6:11 PM IST:

2018 ఎన్నికల్లో 86 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
 
6:06 PM IST:

దుబ్బాక స్థానంలో సాయంత్రం ఐదు గంటలకు 81.44 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలవరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించింది ఈసీ

5:07 PM IST:

దుబ్బాకలో పోలింగ్ ముగియడానికి ఇంకా గంట సమయం మాత్రమే సమయం ఉంది. చివరి గంటలో కోవిడ్ బాధితులు ఓటింగ్ కు అవకాశం కల్పించనుంది 

4:03 PM IST:

దుబ్బాకలో మూడు గంటలకు 71. 10 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లు గుంపులుగా పోలింగ్ కేంద్రాలు చేరుకొంటున్నారు. పోలీసులు జనాన్ని తరిమికొడుతున్నారు

1:34 PM IST:

దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా కదులుతున్నారు. దీంతో ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివవరకు 55.52శాతం పోలింగ్ నమోదయ్యింది. 

11:38 AM IST:

దుబ్బాక ఉప ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 34.33 శాతం పోలింగ్ న‌మోదయ్యింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 

10:10 AM IST:

దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అరగంట నుండి పోలింగ్ నిలిచిపోయింది.

9:13 AM IST:

దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు అంటే ఉదయం 9 గంటలవరకు 16 శాతం ఓటింగ్ పూర్తయినట్లు సమాచారం. 

9:11 AM IST:

దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన తుక్కాపూర్ లో ఆయన ఓటేశారు. 
 
9:05 AM IST:

దుబ్బాకలో ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుబ్బాక మండలంలోని తన స్వగ్రామం బొప్పాపూర్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు.   

7:55 AM IST:

స్వగ్రామం చిట్టాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసివచ్చి ఓటేసిన ఆమె పోలింగ్ సరళిని పరిశీలించారు.   

7:23 AM IST: