డ్రగ్స్ మత్తులో కొందరు యువతీ, యువకులు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతూ హల్ చల్ సృష్టించారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వాళ్లలో వాళ్లే ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడులు చేసుకుని స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. 

పాతబస్తీలోని ఫలక్‌నామా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ ముగ్గురు అమ్మాయిలు, కొంతమంది యువకులు వైట్నర్ తీసుకున్నారు. ఈ మత్తులో తూగుతూ రోడ్డుపైకి వచ్చారు. ఈ క్రమంలో వారిలో వారే గొడవపడుతూ కత్తులతో, బ్లేడ్లతో దాడి చేసుకున్నారు.  దీంతో కలకలం రేగింది.

మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియని ఓ యువతి తనపై తానే బ్లేడ్ తో దాడిచేసుకుంది. చేతి మణికట్టు కోసుకుంది. అయితే స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతీచ యువకులను అదుపులోకి తీసుకున్నారు.  యువతితో పాటు గాయపడిన మరికొంత మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.