శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు అధికారులు. రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. యుగాండా, జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

Also Read:ట్రాలీ బ్యాగ్ కింద 70 కోట్ల హెరాయిన్, కనిపించకుండా స్ప్రే: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు మహిళల అరెస్ట్

కాగా, కొద్దిరోజుల క్రితం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.70 కోట్ల విలువైన 10 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. జోహెన్నెస్‌బర్గ్ నుంచి చెన్నై వచ్చిన ఆఫ్రికన్ మహిళల నుంచి వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో పెట్టి హెరాయిన్‌ను తరలించేందుకు వారు యత్నించారు.

కస్టమ్స్ అధికారులు గుర్తుపెట్టకుండా ఆ కిలాడీ లేడీలు స్ప్రే కొట్టారు. అనంతరం ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై, హైదరాబాద్‌లలోని డ్రగ్స్ లింకులపై డీఆర్ఐ విచారణ చేపట్టింది. అటు హైదరాబాద్‌లో డ్రగ్స్ స్వాధీనం చేసుకునేవారిపై కూడా ఆరా తీస్తోంది.