Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ తీసుకొంటే జైలుకే, సినిమా వాళ్లకు మినహాయింపుల్లేవ్: హైద్రాబాద్ సీపీ ఆనంద్ వార్నింగ్

హైద్రాబాద్  సహా దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న  టోని అనే నైజీరియన్ ను అరెస్టు చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

Drug Peddler Tony Arrested in Mumbai Hyderabad CP CV Anand
Author
Hyderabad, First Published Jan 20, 2022, 12:23 PM IST


హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోని అనే నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఇక నుండి డ్రగ్స్ తీసుకొంటే జైలుకు వెళ్లాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. టోనితో పాటు ఏడుగురు వ్యాపారులను కూడా అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు వ్యాపారుల పేర్లను కూడా  వెల్లడిస్తామన్నారు.

hyderabad సీపీ సీవీ Anand గురువారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.వ్యాపారవేత్తలు నిరంజన్ కుమార్ జైన్, శాషవత్ జైన్, యోగనాంద్ అగర్వాల్, దండు సూర్యసుమంత్ రెడ్డి, బండి భార్గవ్,వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్,  సుబ్బారావులను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.  హైద్రాబాద్ నగరంలో డ్రగ్స్ తీసుకొన్న వారి చిట్టా తమ వద్ద ఉందని సీపీ ఆనంద్ చెప్పారు. డ్రగ్స్ తో తీసుకొంటే ఇక జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. మరో నలుగురు వ్యాపారుల పేర్లను కూడా త్వరలోనే వెల్లడిస్తామని సీపీ చెప్పారు. 

పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న Drugs సరఫరా చేసే నైజీరియన్ టోనిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. దేశంలోని ముఖ్య పట్టణాలకు tony డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ వివరించారు. బెంగుళూరు, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక గ్యాంగ్ లు ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. తాత్కాలికమైన వీసా, పాస్‌పోర్టు తో టోని ఇండియాకు వచ్చి డ్రగ్స్ దందా నడుపుతున్నాడని సీవీ ఆనంద్ చెప్పారు. టోనీ వీసా, పాస్‌పోర్ట్ గడువు తీరిన తర్వాత కూడా రహస్యంగా ముంబైలో తలదాచుకొంటున్నట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు.

టోని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ గుర్తు చేశారు.  ఇమ్రాన్  అరెస్ట్ చేసిన విషయం తెలియగానే టోని తన వాట్సాప్ చాటింగ్ ను డిలీట్ చేశారని సీవీ ఆనంద్ చెప్పారు. 2013లో  నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చారన్నారు. ముంబైలోని ఈస్ట్ అంథేరిలో నివసిస్తున్నాడని ఆనంద్ వివరించారు.

టోని సహా మరో  9 మందిని అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.డ్రగ్స్ తీసుకొనే వారిని అరెస్ట్ చేయకపోతే కట్టడి చేయలేమన్నారు సీపీ. డ్రగ్స్ తీసుకొన్నా, విక్రయించినా వారి మూలాలను వెలికితీస్తామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.ఇప్పటికే  డ్రగ్స్  తీసుకొన్న  ఏడుగురు వ్యాపారులను కూడా అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. వ్యాపారవేత్తలు, ఆఫీస్ బాయ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొన్నారని సీపీ చెప్పారు. సినీ రంగంలో వారికి ఇకపై డ్రగ్స్ కేసులో మినహాయింపులుండవని ఆయన తేల్చి చెప్పారు. 

హైద్రాబాద్ నగరంలో డ్రగ్స్  సరఫరా చేసే వారిపై నిఘాను ఏర్పాటు చేశామని  సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సీవీ ఆనంద్ తెలిపారు. పదే పదే డ్రగ్స్ తీసుకొనే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. హైద్రాబాద్ లో డ్రగ్స్ తీసుకొంటున్న వారిలో వ్యాపారులు, రాజకీయ నేతల పిల్లలు, సినీ పరిశ్రమకు చెందిన వారున్నారని ఆనంద్ తెలిపారు.హైద్రాబాద్ నగరంలో సుమారు 300 మంది డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios