హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాడు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు అధికారులు.గతంలో కూడ ఇదే విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే. సుమారు రూ.53 కోట్ల విలువైన హెరాయిన్ ను  కస్టమ్స్ అధికారుల సీజ్ చేశారు. గోవా నుండి ఇవాళ శంషాబాద్ కు వచ్చిన మహిళా ప్రయాణీకురాలి నుండి అధికారులు  హెరాయిన్ ను సీజ్ చేశారు. 

జాంబియాకు చెందిన ముకుంబా కరోల్ నుండి హెరాయిన ను సీజ్ చేశారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా డిఆర్ఐ అధికారులు ఆమెను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆమె వద్ద నుండి భారీగా హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు.హెరాయిన్ ను హైద్రాబాద్ లో ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకొచ్చిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడ హైద్రాబాద్ నగరంలో డగ్ర్స్  దందా సాగింది.
సెలబ్రిటీలు, స్కూల్ పిల్లలను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ దందా సాగింది. ఈ విషయై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.