హైదరాబాద్: హైద్రాబాద్ లో  భారీ స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్నారు డీఆర్ఐ అధికారులు. 250 కిలోల మత్తుమందు ఏపీడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్ ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

కచ్చితమైన సమాచారం మేరకు ముంబై, హైద్రాబాద్ లలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు డ్రగ్స్ ముఠాను పట్టుకొన్నారు.హైద్రాబాద్ నుండి ముంబైకి బస్సులో కార్గో ద్వారా మత్తుమందు సరఫరా చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ బస్సును ఛేజ్ చేసి పట్టుకొన్నారు.

హైద్రాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో మత్తుమందు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకొన్న డ్రగ్స్  విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరోవైపు రూ. 50 కోట్ల విలువచేసే మత్తుమందు తయారు చేసే రా మెటిరీయల్ ను కూడ స్వాధీనం చేసుకొన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు మత్తుమందును సరఫరా చేయాలని డ్రగ్స్ మాపియా ప్లాన్ వేసింది. గతంలో అరెస్టైన డ్రగ్స్  డీలర్ ను డీఆర్ఐ అధికారులు పట్టుకొన్నారు.గతంలో కూడ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో  డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు.