Asianet News TeluguAsianet News Telugu

కారు బోల్తా మహిళ మృతి.... నేరం నాది కాదు.. ఫ్లైఓవర్ దే..

నవంబరు 23న కారు నడుపుతూ అదుపుతప్పి ఫ్లైఓవర్‌పైనుంచి ఒక మహిళపై పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాయ్‌దుర్గ్‌ పోలీసులు నిందితునిపై ఐపీసీ 304ఏ, 337, 279 సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ కృష్ణమిలన్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు.

Do not arrest Krishna Milan rao till january3rd , says High Court
Author
Hyderabad, First Published Dec 13, 2019, 10:42 AM IST

గత నెలలో బయో డైవర్సిటీ ప్లై ఓవర్ పై ఓ కారు ప్రమాదానికి గురైన సంగతి గుర్తుండే ఉంటుంది. కారు ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడగా.... కింద బస్టాండ్ లో ఉన్న మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారకుడైన కృష్ణ మిలన్ రావు(27)ని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే.... ఈ ప్రమాదానికి కారణం తాను కాదని...ఫ్లై ఓవర్ అంటూ నిందితుడు చెప్పడం గమనార్హం. ఈ ప్రమాద కేసులో ఇటీవల న్యాయస్థానం... అతనిని డిసెంబర్ 12వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని చెప్పింది. తాజాగా... ఆ ఆదేశాన్ని జనవరి  3 వరకు పొడిగించింది.

నవంబరు 23న కారు నడుపుతూ అదుపుతప్పి ఫ్లైఓవర్‌పైనుంచి ఒక మహిళపై పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాయ్‌దుర్గ్‌ పోలీసులు నిందితునిపై ఐపీసీ 304ఏ, 337, 279 సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ కృష్ణమిలన్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు.
 
ప్లైఓవర్‌ నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, ప్రమాద సమయంలో తాను 40-50 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నప్పటికీ అదుపుతప్పి కింద పడినట్లు కోర్టుకు తెలిపారు. ‘ఎస్‌’ ఆకారంలో ప్లైఓవర్‌పై ప్రమాదకరమైన మలుపువల్లే కారు అదుపు తప్పిందన్నారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. 

ఐపీసీ 304ఏ (నిర్లక్ష్యం) కింద నమోదు చేసిన సెక్షన్‌ను 304(2) (మానవ హత్య)గా మార్చి పిటిషనర్‌ను అరెస్టుచేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు నిర్లక్ష్యం కింద నమోదు చేసిన కేసును శిక్షార్హమైన మానవహత్యగా మార్చడాన్ని తప్పుబట్టింది. పిటిషనర్‌ అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను జనవరి 3 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ టి. వినోద్‌ కుమార్‌ గురువారం ఆదేశాలు జారీచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios