హైదరాబాద్: హైదరాబాదులోని డీబీఆర్ మిల్సు వద్ద జరిగిన ఘటనపై హైదరాబాదులోని గాంధీనగర్ ఎసీపీ నర్సింహా రెడ్డి వివరణ ఇచ్చారు. అమ్మాయిపై ఓ యువకుడు అత్యాచారం చేసి, బ్లేడుతో ఆమె జననాంగాలపై గాట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోను యూట్యూబ్ లో కూడా పోస్టు చేశారు. 

ఈ కేసుతో గంజాయికి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి బాలుడు మూడు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడని వారు చెప్పారు. అయితే, ఆమె మరో అబ్బాయితో చనువుగా ఉంటుందనే కోపంతో బాలుడు ఆమెపై దాడి చేశారని వారు అంటున్నారు.

అమ్మాయి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి మార్చి 8వ తేదీన ఫిర్యాదు చేశాడని, అదే రోజు బాలిక పోలీసు స్టేషన్ కు వచ్చిందని, ఆమ్మాయికి కౌన్సెలింగ్ కు ఇచ్చి భరోసా సెంటర్ కు పంపించామని చెప్పారు. 

నిందితుడిని జువెనైల్ హోంకు తరలించినట్లు తెలిపారు. ఘటనను వీడియో తీసినవారిపై ఐటి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

బాలికపై రేప్, వీడియో ఘటనలో విస్తుపోయే విషయాలు: పెద్ద గ్యాంగే..

హైదరాబాద్ నడిబొడ్డున దారుణం: బాలికపై రేప్, జననాంగంపై బ్లేడుతో గాట్లు, వీడియో చిత్రీకరణ