హైదరాబాద్: హైదరాబాదులోని డిబీఆర్ మిల్స్ సమీపంలో బాలికపై అత్యాచారం చేసి, వీడియో తీసి యూట్యూబ్ లో పోస్టు చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి సంఘటన ఇది ఒక్కటి మాత్రమే కాదని, ఇటువంటి సంఘటనలకు పాల్పడేవారంతా ఓ ముఠాగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. 

అదో గంజాయి ముఠా అని, అందులో 15 మంది అబ్బాయిలతో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారని సమాచారం. ఓ అమ్మాయిపై ఓ యువకుడు అత్యాచారం చేస్తూ, బ్లేడుతో జననాంగాలపైనా శరీరంపై బ్లేడుతో గాట్లు పెట్టిన దారుణమైన సంఘటన హైదరాబాదులో వెలుగు చూసిన విషయం తెలిసిందే. 

ఈ ముఠాలో నాను అలియాస్ నాగరాజు, బాబా అలియాస్ అభిరామ్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ ముఠా అమ్మాయిలకు గంజాయి అలవాటు చేస్తూ, వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూ వీడియోలు తీస్తూ వస్తున్నారని అంటున్నారు. ఈ వీడియోలను చూపిస్తూ అమ్మాయిలను బెదిరించడం కూడా అలవాటు చేసుకున్నారని అంటున్నారు.  

ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారని, హైదరాబాదులోని గంజాయి స్మగ్లర్లు పలువురు ఆ ముఠా సభ్యులకు పరిచయమని, వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ వస్తున్నారని, అలా రూ. 18 వేలు వసూలు చేశారని అంటున్నారు.

సంబంధిత వార్త

హైదరాబాద్ నడిబొడ్డున దారుణం: బాలికపై రేప్, జననాంగంపై బ్లేడుతో గాట్లు, వీడియో చిత్రీకరణ