హైదరాబాద్: ఖరీదైన ప్రాంతంలో  నివాసం ఉంటూ వ్యభిచారం నిర్వహించడమే కాకుండా.... విటులకు డ్రగ్స్  సరఫరా చేసే  జంటను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 2వ తేదీన ఫిలింనగర్‌ రోడ్డు నంబర్‌లో ఉన్న ఇంటిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఇంటి నుండి  7 గ్రాముల కొకైన్, 2 గ్రాముల ఓపీఎం, మూడు ద్విచక్ర వాహనాలు, రూ. 1.13 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నారు.

ఈ ఇంట్లో బి.సంతోష్, మహ్మద్ మసూద్‌లను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఇంట్లో షేక్ ఫహద్ అలియాస్ మదన్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పోలీసులను చూసి షేక్ ఫహద్ అలియాస్ మదన్  కారులో పారిపోయాడు.  పోలీసులు కేసు నమోదు చేశాడు. 

ఫహద్ అలియాస్ మదన్  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇదిలా ఉంటే బంజరాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో సాయిబాబా ఆలయం వద్ద ఓ కారులో కొకైన్  అమ్మకానికి ఉందనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.  కారులో షేక్ ఫహద్ అలియాస్ మదన్ ఆయన భార్య సలీమా రబ్బాయి షేక్  దొరికారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరి నుండి  9 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీరి నుండి రూ. 3లక్షల నగదు, 4 మొబైల్ ఫోన్‌లు, ఒక స్వైపింగ్ మెషిన్, స్విఫ్ట్ కార్డును స్వాధీనం చేసుకొన్నారు.

ఫహద్ ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుండి హైద్రాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వ్యభిచారం నిర్వహించేవాడు.2018 జనవరి మాసంలో అరెస్టయ్యాడు. దీంతో ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్ 5కు మకాం మార్చాడు.  ఫహాద్ అక్కడ నెలకు రూ. 75 వేలు కిరాయితో ఇల్లు తీసుకొన్నాడు.  కింద భాగంలో తాను నివాసం ఉంటూ.. పై భాగంలో వ్యభిచారాన్ని నిర్వహించేవాడు. 

వ్యభిచారం కోసం వచ్చే విటులకు డ్రగ్స్ తీసుకోవడం గుర్తించి  డ్రగ్స్ కూడ విక్రయించడం ప్రారంభించాడు.   సన్ సిటీ ప్రాంతంలోని ఒక నైజీరియన్ నుండి రూ. 6 వేలకు గ్రాము చొప్పున కొకైన్ కొనుగోలు చేసి రూ.7500లకు అమ్మేవాడు. సంతోష్, సురేష్, మహ్మద్ మసూద్‌లతో పాటు తన భార్య సహకారంతో ఈ దందాను నడిపేవాడు.